ఆ పని చేసి ప్రభాస్ మనసు దోచేసిన యంగ్ హీరోయిన్..ఫ్యాన్స్ ఫిదా..!

Thota Jaya Madhuri
సాధారణంగా సోషల్ మీడియాలో చాలా సెలెక్టివ్‌గా మాత్రమే స్పందించే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ లేదా అత్యంత సన్నిహితుల విషయంలో తప్ప అరుదుగా స్పందించే ‘రెబల్ స్టార్’ ఈసారి ఓ యంగ్ హీరోయిన్ టాలెంట్‌ను చూసి మనసు విప్పి ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “నీ గొంతు నేరుగా నా మనసును తాకింది” అంటూ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇంతకీ ప్రభాస్‌ను అంతగా ఆకట్టుకున్న ఆ యువ హీరోయిన్ ఎవరు? ఆమె లోని ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్, తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాలీవుడ్ యువ నటి రాషా తడాని పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ నటి రవీనా టాండన్, ప్రముఖ నిర్మాత అనిల్ తడాని కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాషా, కేవలం స్టార్ కిడ్‌గా కాకుండా తన ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.రాషా తడాని బాలీవుడ్‌లో ‘లైకీ లైకా’ అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. అయితే ఈ చిత్రంలో ఆమె నటనతో పాటు తన సింగింగ్ టాలెంట్‌ను కూడా ప్రదర్శించింది. ఇందులో భాగంగా ఆమె ఆలపించిన ‘చాప్ తిలక్’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాషా గొంతులోని మాధుర్యం, భావవ్యక్తీకరణ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ పాటను విన్న ప్రభాస్, రాషా సింగింగ్ టాలెంట్‌కు ఫిదా అయిపోయారు. ఆమె ఫోటోలను షేర్ చేస్తూ, “రాషా… నీ సింగింగ్ డెబ్యూ చాలా అద్భుతంగా ఉంది. నీ గొంతు నేరుగా నా మనసును తాకింది” అంటూ హృదయపూర్వకంగా అభినందించారు. సాధారణంగా ఎవరినైనా ఇలా బహిరంగంగా ప్రశంసించడం ప్రభాస్ కెరీర్‌లో చాలా అరుదు. అందుకే ఈ పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో ప్రత్యేక చర్చకు దారి తీసింది.హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ కొంచెం మొహమాటంగా ఉండే ప్రభాస్, ఓ యంగ్ టాలెంట్‌ను గుర్తించి ఇంత ఓపెన్‌గా ప్రోత్సహించడం ఆయన గొప్ప మనసుకు మరో ఉదాహరణగా నిలుస్తోంది. ప్రభాస్ ఇచ్చిన ఈ ప్రశంసలు రాషా తడాని కెరీర్‌కు మరింత బలం చేకూరుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

రవీనా టాండన్ కుమార్తెగా కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలనే లక్ష్యంతో రాషా చేస్తున్న ప్రయత్నాలను పలువురు అభినందిస్తున్నారు. నటిగా మాత్రమే కాదు, గాయనిగా కూడా తన సత్తా చాటుతూ ముందుకెళ్తున్న రాషా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారగా, రాషా తడాని టాలెంట్‌పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: