గేమ్ ఛేంజర్: చరణ్‌ ఫ్యాన్‌ ఆత్మహత్యయత్నం..లేఖ వైరల్‌ !

Veldandi Saikiran
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రామ్ చరణ్.... ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్... సంచలన లేఖ విడుదల చేశాడు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ట్రైలర్... తొందరగా రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
 
ఈ మేరకు ఓ లేక విడుదల చేసి రచ్చ చేశాడు రామ్ చరణ్ అభిమాని. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి 13 రోజులు మాత్రమే ఉంది సమయం. కానీ ఇప్పటిది కూడా ట్రైలర్ రిలీజ్ కాలేదని... రామ్ చరణ్ అభిమాని ఈశ్వర్... సంచలన లేఖ రాయడం జరిగింది.
 
కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయాలని... లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించి.. లేక రాశాడు ఈశ్వర్. ఈ సినిమా రిలీజ్ కావడానికి 13 రోజుల సమయం మాత్రమే ఉందని.... ఇంకా కూడా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే... తన బతకనని తెలిపాడు. తన ఒక్కని బాధే కాదని... రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఇదే అనుకుంటున్నారని పేర్కొన్నాడు. తన బాధ అర్థం చేసుకొని ఇప్పటికైనా గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయాలి అని డిమాండ్ చేశారు.
 
ఒకవేళ కొత్త సంవత్సరం కానుకగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు. అయితే మేక అభిమాని ఈశ్వర్ రాసిన లేక పైన  రామ్ చరణ్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండక గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేయగా... కియారా అద్వానీ హీరోయిన్గా చేసింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: