ఒకటి కాదు రెండు కాదు 100 పాములతో అలా .. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Amruth kumar
అహాలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.. గత మూడు సీజన్లు మాదిరిగానే ఈసారి కూడా టాలీవుడ్ స్టార్ ప్రముఖులు ఈ టాక్ షోలో పాల్గొని తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా బాలయ్య టాక్ షోలో స్టార్ హీరో వెంకటేష్ సందడి చేశారు. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు ఓపెన్గా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అలాగే తన వ్యక్తిగత లైఫ్ గురించి కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

ఇదే క్రమంలో బొబ్బిలి రాజా సినిమాలో కొండచిలువను పట్టుకున్న‌ ఓ ఫోటోను చూపించి ఇది నిజమైన పాములతో తీసారా లేదా గ్రాఫిక్స్ తో మేనేజ్ చేశారా.. అని బాలకృష్ణ అడగ.. ఇక దానికి వెంకటేష్ షాకింగ్ సమాధానం ఇచ్చాడు .. ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 పాములతో కలిసి ఆ సన్నివేశాన్ని తెరకెక్కించార‌ని చెప్పడంతో బాలకృష్ణతో పాటు షోలో కూర్చుని ఆడియన్స్ కూడా ఒక్కసారి షాక్ అయ్యారు. ఇక బొబ్బిలి రాజా సినిమా అంటే మా అన్నయ్యకు ఎంతో ఇష్టం.. ఇందులో కొండచిలువను పట్టుకునే సీన్లు హాలీవుడ్ సినిమా నుంచి రిఫరెన్స్ గా తీసుకున్నాం.. ముందుగా ఆ సీన్‌ను నేను చేయగలనా అని భయపడ్డాను..

కానీ చివరకు ధైర్యం తెచ్చుకొని ఆ పాములు అన్న గదిలోకి దూకాను అక్కడ ఉన్న పాములు పట్టే అబ్బాయి నా మీద పాములు చేశాడు.. ఇక అప్పుడు ఎంతో థ్రీల్లింగ్ అనిపించింది .. అది నాకు గొప్ప అనుభవం ఇచ్చిందని వెంకటేష్ చెప్పగచాడు.  అలాగే చిత్ర పరిశ్రమలోకి ఎలా అడుగు పెట్టావని బాలయ్య అడగ్గా.. నాకు సినిమాల్లోకి రావడం అంటే ఇష్టం లేదు .. అసలు హీరో అవుతానని అనుకోలేదు .. విదేశాల్లో చదువుకొని అక్కడే ఉండాలని అనుకున్నాను .. 1986లో ఇండియాకు తిరిగి వచ్చాక ఏదైనా బిజినెస్ చేద్దామని భావించాను .. కానీ అది సెట్ కాలేదు.. ఊహించిన విధంగా కలియుగ పాండవులతో హీరోగా మారానని వెంకటేష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: