హరీష్ శంకర్ పవర్ స్టార్ తో చెయ్యబోయే సినిమా పక్కా ఊర మాస్ సినిమానట...

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షలాది ఫ్యాన్స్ ఆయన సొంతం. అయితే పవర్ స్టార్ కెరీర్ లో ఎక్కువ లవ్ స్టోరీలు క్లాస్ మూవీస్ చాలా ఎక్కువ. అయినా కాని మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ఇక రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ దాదాపు మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రాబోతున్నాడు.సామాజిక అంశానికి పవర్ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టు కమర్షియల్ అంశలు జోడించి తెరకెక్కించిన వకీల్ సాబ్ ఈనెల 9న ప్రేక్షకుల ముదుకు రాబోతోంది.ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మొదటిసారి పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాతో పాటు యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు.


ఈ రెండు సినిమాలని సమాంతరంగా చేస్తున్న పవన్ నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతుండగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా కథా నేపథ్యం ఏంటో అన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు హరీష్ శంకర్ మాంచి మాస్ కథను సిద్దం చేసి పవర్ స్టార్‌కి వినిపించినట్టుగా తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్ చెప్పిన కథ పవన్‌కి నచ్చడంతో షూటింగ్‌కి సన్నాహాలు చేస్తున్నారట.ఇక ప్రస్తుతం సెట్స్ మీదున్న రెండు సినిమాల షూటింగ్ పూర్తయ్యాక హరీష్ శంకర్ సినిమా మొదలవనున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ మాములుగా ఉండవట. ఇక ప్రతి సీన్ కూడా అభిమానులను ఉర్రూతలూగించేలా ఉంటుందట. ఇందులో వున్న ఎలివేషన్స్ కి ఫ్యాన్స్ అల్లరి చెయ్యడం ఖాయమట. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: