18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డు యు రిమెంబర్ అనే కాన్సెప్ట్ తో సోషల్ మీడియా చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా ఓ కొంటె ప్రశ్నకు సమాధానం ఇచ్చేసింది అమ్మడు. మీ తొలి ముద్దు అనుభవం ఏ ఏట జరిగిందని అడిగితే.. పరిణితి ఎలాంటి మొహమాటం లేకుండా 18 ఏళ్లకే అనేసింది. తనకు సైఫ్ ఆలి ఖాన్ అంటే ఇష్టమని చెప్పిన పరిణితి ఇప్పటివరకు ఎవరితో డేటింగ్ చేయలేదని అంటుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఆడియెన్స్ హాట్ బ్రేక్ చేసిన చోప్రా సిస్టర్ ఇప్పుడు తిరిగి మళ్లీ అదే ఫాం తెచ్చుకోవాలని చూస్తుంది.
ఈమధ్య పరిణీతి కూడా సౌత్ సినిమాల మీద కన్నేస్తుందని అన్నారు. ఆమె తెలుగులో చేయకపోయినా పరిణితికి తెలుగులో కూడా క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అలియాకు బదులుగా ముందు పరిణితిని అడిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ భామలకు తెలుగు సినిమా ఆఫర్ వచ్చినా ఇక్కడ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇస్తారు. అందుకే వీరికి ఇక్కడ అవకాశాలు రావట్లేదు. ఖాళీగైనా ఉంటారు కాని సౌత్ సినిమాలు మాత్రం చేయరు బాలీవుడ్ భామలు. కొందరు మాత్రం తెలివిగా ఇక్కడ అక్కడ చేసేస్తారు.