హీరోయిన్ ప్రియమణితో హైపర్ ఆది ఎఫైర్.. నిజమేనా?

praveen
ఒకప్పుడు దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన ప్రియమణి.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది అన్న విషయం తెలిసిందే. అయితే తెలుగుతోపాటు తమిళ కన్నడ సినిమాల్లో నటించి వరుసగా సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న ఈ హీరోయిన్.. ఇక సినిమాలకు దూరం అవడంతో అభిమానులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ మద్దుగుమ్మ.. వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఒకవైపు సీనియర్ హీరోల సినిమాల్లో ఛాన్సులు తగ్గించుకుంటూనే.. ఇంకోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. వైవిద్యమైన పాత్రలు చేస్తూ తనలో ఉన్న నటిని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

 ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే.. ఇంకోవైపు సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ బిజీ బిజీగా  గడుపుతుంది ఈ సొగసరి. అయితే ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో గతంలో జడ్జిగా కూడా చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఢీ లో జడ్జిగా చేస్తున్న సమయంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో ప్రియమణికి మంచి బాండింగ్ ఏర్పడింది. ఏకంగా ఆదిని బావ బావ అంటూ పిలుస్తూ ఉండేది ప్రియమణి. వీరిద్దరి ఫన్నీ ఎపిసోడ్స్ కూడా ఎంతో హైలెట్ గా నిలిచేవి. అయితే ఇలా కేవలం ఫన్నీగా జోక్స్ వేసుకోవడం మాత్రమే కాదు ఒకసారి ఏకంగా హైపర్ ఆది కూర్చొని ఉన్న సమయంలో ప్రియమణి అతని ల్యాప్ పై కూర్చోవడంతో అందరూ షాక్ అయ్యారు.

 దీంతో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది హీరోయిన్ ప్రియమణి మధ్య ఎఫైర్ ఉంది అంటూ అప్పట్లో ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హైపర్ ఆది పాల్గొనగా ప్రియమణితో ఎఫైర్ గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రియమణి జాతీయ అవార్డు గ్రహీత అయినప్పటికీ సెట్స్ లో అందరితో క్లోజ్ గా స్పోర్టివ్ గా ఉంటారు. నన్ను బావ అని పిలుస్తుంది. ఎప్పుడు ఏం చేసినా అంతే స్పోర్టివ్ గా తీసుకుంటారు. చిన్న చిన్న ఆర్టిస్టులతోనూ కలిసిపోతారు. డాన్సర్లతో కలిసి రీల్స్ చేశారు.  ఓ స్టేజ్ నుంచి వచ్చారు స్టార్ ఇమేజ్ ని అనుభవించి వచ్చారు చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడంలో ది బెస్ట్. అప్పట్లో మా మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: