జగన్: పెన్షన్ టెన్షన్.. మొదలయ్యిందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం కాస్త ఆందోళన చెందుతున్నారు. గత రెండు నెలల నుంచి పింఛన్ టెన్షన్ ఇద్దరి నేతలకు కూడా మొదలవుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ కి పెన్షన్ చాలా టెన్షన్ పెట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా వృద్ధులు, వికలాంగులు ఈ పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా.. ఉంటే ఇస్తున్నారా..లేకపోతే అప్పు తెచ్చిస్తున్నారా అనే విషయాలని అసలు పట్టించుకోరు.. నాది హక్కు అని ఫీల్ అవుతూ ఉంటారు.
అందుకే పెన్షన్ జగన్ ఏడాదికి 250 పెంచుతున్నప్పుడు సంతోషపడ్డారు.. అలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు వచ్చేసరికి 200 ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేశారు.. ఆ వెయ్యి రూపాయలను జగన్ పాదయాత్రలో 2000 రూపాయలు అన్నప్పుడు అంతకుముందే చంద్రబాబు చేసేసారు. అంతకుముందు పెన్షన్ 39 లక్షల వరకు ఉండగా చివరిలో 59 లక్షల వరకు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 3000 అని చెప్పారు. ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచుతానని కూడా వెల్లడించారు.

అయితే ఇప్పుడు తాజగా జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో విషయానికి వస్తే.. 3500 చేస్తాను అయితే అది చివరి 2028 ,29వ సంవత్సరంలో అయితే చేస్తానంటూ తెలిపారు.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏక్దముగా 4000 రూపాయలు చేస్తానట్టు ప్రకటించారు. అలాగే ఈ రెండు నెలల డబ్బులు కూడా కలిపి ఇస్తానని తెలుపుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని తెలిపారు చంద్రబాబు. దీంతో జగన్ కచ్చితంగా నాలుగువేలు లేదా ఐదు వేల రూపాయలు అంటారని అందరూ అనుకున్నారు. 3,500 రూపాయల వద్దే ఆగిపోయారు. ఇప్పటివరకు వృద్ధులకు, వికలాంగులకు ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం వల్ల తద్వారా వారి మనసులు గెలుచుకున్నారు. పెంచుకుంటూ పోవడం వల్ల కూడా మనసు గెలుచుకున్నారు. పెంచే విషయంలో మాత్రం మైనస్ అవుతుందా..? ఎందుకంటే ప్రస్తుతం 70 లక్షలకు మంది పైగా పెన్షన్ అందుకుంటున్నారు. వీళ్లల్లో తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని కచ్చితంగా హైలైట్ చేస్తుందని కొంతమంది నేతలు తెలుపుతున్నారు. ప్రచారంలో భాగంగా జగన్ ఎప్పుడో పెంచితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పెంచేస్తామంటూ టిడిపి నేతలు తెలుపుతున్నారు. మరి అది మైనస్ ఆ ప్లస్ అనే విషయం పైన ఆలోచించుకోవలసి ఉంటుంది వైసీపీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: