ఏపీ: పవన్ కళ్యాణ్‌ ఇజ్జత్‌కే సవాల్.. ఓడిపోతే తల ఎక్కడ పెట్టుకుంటాడో..?

Suma Kallamadi
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ గెలవడం పవన్‌కు అనివార్యంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్‌ను తన నాలుగో పెళ్ళాం కావాలంటూ పవన్ పిచ్చి కూతలు కూసాడు. తనకే మగతనం ఉన్నట్లు, తానే పోటుగాడు అన్నట్టు ప్రతి ఎన్నికల ప్రచార సభలో ఊగిపోయాడు. ఇన్ని మాటలు మాట్లాడిన పవన్ ఓడిపోతే పరువు పోతుంది. పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చేతకాని పొలిటిషన్ గా మిగిలిపోతాడు.2019 ఎలక్షన్స్ లో పవన్ గాజువాక, భీమవరం స్థానాల నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నాడు. అయితే జగన్ పవన్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని చాలానే ట్రై చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు, కీలకమైన రోజు అయిన మే 11న జగన్ పిఠాపురం లోనే సభ నిర్వహించి పవన్ గెలిచే ఛాన్సెస్ శూన్యం చేశారు.
పిఠాపురంలో 2.29 లక్షల మంది ఓటర్లు ఉంటే.. వారిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఏకంగా 75 వేల మంది దాకా ఉన్నారు. ఎస్సీలు 28, మాలలు 20 వేలు, మాదిగలు 8 వేలు, శెట్టి బలిజ 23 వేల మంది, 17 వేల మత్స్యకారులు, రెడ్లు 10 వేల మంది, కొప్పుల వెలమ 9 వేలు, తూర్పు కాపు 7 వేలు, క్షత్రియులు 6 వేల మంది ఉన్నారు. ఈ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుంటే కాపులే ఈ నియోజకవర్గంలో గెలుపును శాసిస్తారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి వీరిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అయితే వైసీపీ కూడా వ్యూహాత్మకంగా కాపు కులానికి చెందిన వంగా గీతను బరిలోకి దింపింది.
కాకినాడ ఎంపీ వంగా గీతకు రాజకీయాల్లో చాలా అనుభవం ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈమె విజయకేతనం ఎగురవేశారు. 2019లో వైసీపీ నుంచి కాకినాడలో ఎంపీగా విజయం సాధించారు. జగన్ వంగా గీత గురించి మంచి చెబుతూ ఆమెకు ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ కోసం రామ్ చరణ్, జబర్దస్త్ నటులు ప్రచారాలు చేశారు. అయితే ఈ ఇద్దరి అభ్యర్థులలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఓడిపోతే పవన్ తల ఎత్తుకోలేడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: