ఏపీ : సైకిల్ ను చిత్తు చేసేలా జగన్ చివరి బ్రాహ్మస్త్రం..!!

FARMANULLA SHAIK
ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది .మరి కొన్ని గంటల్లో 175 నియోజకవర్గాలకు మరియు 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.చివరి రోజు జగన్ ప్రసంగం అనేది చిలకలూరిపేటలో ప్రారంభం అయి కైకలూరు ,పిఠాపురంతో ముగిసింది.ఈ మూడు ప్రసంగాల్లో జగన్ తన మార్క్ చూపించారు.గెలుపే లక్ష్యంగా తమ తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈసారి ఎన్నికల్లో సంక్షేమ ఓట్ బ్యాంక్పై జగన్ చాల హోప్స్ పెట్టుకొనిఉన్నారు.తన గెలుపుకి సంక్షేమ పథకాలే కీలకపాత్ర పోశిస్తాయనిఅన్నారు. జగన్ గత ఐదేళ్ల కాలంగా అమలు చేస్తున్న పథకాలు కొనసాగింపు పై కూడా  హామీ ఇచ్చారు. అలాగే చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీలను ప్రకటించినప్పటికీ అవి ప్రజల్లో విశ్వాసం కల్గించలేదని తెల్సుకున్న టీడీపీ తమ వ్యూహం మార్చుకొని కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతొ ప్రధాన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ట్రై చేసింది .దానికి ధీటుగా జగన్ ప్రజల్లోనే కౌంటర్ ఇచ్చారు.ఇంకా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఒర్జినల్ డాక్యుమెంట్ ఇవ్వకుండా డూప్లికేట్ ఇస్తున్నారంటూ కూడా ప్రచారం చేశారు. అయితే దీంతో జగన్ తాజాగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చేయించుకున్న రిజిస్ట్రేషన్లలకు సంబంధించి  ఒరిజినల్ పత్రాలు ఇచ్చారా లేదా అంటూ ప్రశ్నించారు..
ఇంకోవైపు ఎన్నికలకు రెండు రోజుల ముందు నగలు బదిలీ పధకాలు గూర్చి కూడా టీడీపీ విమర్శలు చేసింది.అసలు ఎన్నికల సంఘంతో కలిసి నగలు జమ చేయనీకుండా టీడీపీ హస్తం ఉందని కూడా జగన్ అన్నారు.అయితే రేపు పోలింగ్ పూర్తికాగానే మంగళవారం రోజున లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రెండు నెలల నుంచి సాగుతున్న పెన్షన్ల వివాదం, ఇప్పుడు పథకాల నగదు బదిలీ అంశం కూటమికి బాగా మైనస్ గా మారుతుయాని వైసీపీ నేతలు అంటున్నారు.జగన్ వదిలిన ఈ రెండు బ్రహ్మస్త్రాలు తమ గెలుపుకు ఉపయోగపడతాయని వైసీపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: