నయన్ ఆఫర్లని కూడా కొట్టేస్తున్న త్రిష.. పాపం నయనతార..!?

Anilkumar
ఏంటి త్రిష నయనతార మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా.. ఈ వార్ లో త్రిషనే ముందుందా లేదా లేడీ సూపర్ స్టార్ ముందు ఉందా.. అసలు మ్యాటర్ ఏంటి అంటే.. ఒకప్పుడు వరుస సినిమాలో చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష కి 40 సంవత్సరాలు దాటాక ఇప్పుడు పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి. కోవిడ్ ముందు వరకు అవకాశాలు లేక సతమతమవుతున్న ఈమె కెరియర్ ముగిసింది అని అందరూ అనుకున్నారు. అదే సమయంలో త్రిష రేంజ్ ఉన్నట్టుండి  మారిపోయింది. ఒకేసారి పది సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు

 ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్గా కూడా నటిస్తోంది. అలాగే ఒక్కొక్క సినిమాకి దాదాపుగా 6 కోట్లకి పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక విశ్వంభర సినిమాకి అయితే ఏకంగా 10 కోట్ల రెమ్యనరేషన్ తీసుకుంటుందట ఈ బ్యూటీ. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు నయనతార కి రావలసిన సినిమా అవకాశాలు కూడా త్రిష కొట్టేస్తోంది అని అంటున్నారు. దానికి కారణం నాయనతారనే. ఎందుకంటే నాయనతార సినిమా చేసినా కూడా ఆ సినిమాలను ఎక్కడా ప్రమోట్ చేయదు.

 కనీసం ప్రమోషన్స్ కి కూడా రాదు. డేట్స్ విషయంలో కూడా బాగా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ త్రిష విషయంలో మాత్రం అలా అస్సలు జరగదు. త్రిష నిర్మాతలు ఎలా చెబితే అలాగే నడుచుకుంటుంది. ఇదే త్రిషకి కలిసి వచ్చింది అని అంటున్నారు. ఇకపోతే జవాన్ సినిమా తర్వాత సౌత్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు నయనతార. ఇది తనకి బాగా మైనస్ అయింది అని చెప్పాలి. అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా ఎక్కువ డిమాండ్ చేస్తుంది నయనతార. అందుకే అందరూ త్రిష నే తమ సినిమాలో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే నయనతార కి త్రిష కారణంగా సినిమా అవకాశాలు తగ్గాయి అని అందుకే వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అన్న ప్రచారం జరుగుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: