చీర కట్టులో ఆహా అనిపిస్తున్న శ్రీ లీల.. లేటెస్ట్ పిక్స్..!

Anilkumar
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీ లీల. మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ తన నటన డాన్స్ పరంగా మాత్రం మంచి మార్కులే కొట్టేసింది బ్యూటీ. ఈ సినిమా తరువాత తనకి వరుస సినిమాల్లో నటించే అవకాశం వచ్చాయి. అలా చేసిన ధమాకా సినిమా బ్లాక్ బాస్టర్ అందుకోవడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ బ్యూటీ. ధమాకా సినిమా తర్వాత కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతేకాదు ఏడాదికి దాదాపుగా నాలుగు నుండి ఐదు సినిమాలు ఒకేసారి చేసింది. ప్రస్తుతం

 ఈ బ్యూటీ మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో అయినా మంచి విజయాన్ని అందుకోవాలి అనీ ప్రయత్నిస్తోంది.   ఇకపోతే శ్రీ లీల సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం చాలా చురుగ్గా ఉంటుంది. నిత్యం తనకి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో కలుసుకుంటూ ఉంటుంది. అలాగే ట్రెండీ అవుట్

 ఫిట్స్ వేస్తూ తన అందచందాలను చూపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఫోటోలని కొన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో అవి కాస్త  సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ చీరకట్టు తో నేటిజన్స్ ముందుకు వచ్చింది. చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఉన్న ఆ చీరలో నడుము అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటుంది. లైట్ గ్రీన్ చీరలో అదరహో అనిపిస్తోంది ఈ బ్యూటీ. సాధారణంగా ఎప్పుడూ మోడరన్ గా ఉండే ఈమె ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ లో సందడి చేస్తుంది. అలా చీరలో తన అందాలను ఆరబోయడంతో ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: