సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రష్మిక అల్లు అర్జున్ జంట..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప టు. పుష్ప వన్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో పుష్ప టు సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే  సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 15న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. అంతేకాకుండా ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ కూడా

 విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి. అయితే  తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే పుష్ప సినిమాలో కపుల్స్ గా కనిపించబోతున్న ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన ఒక రికార్డు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అది ఏంటంటే.. ఫస్ట్ సింగిల్ లో భాగంగా పుష్ప పుష్ప అనే సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఆ వెంటనే తాజాగా చూసేకి నా సామి అంటూ సాగే మరొక సింగిల్ కూడా విడుదల చేశారు.

 దాంతో ప్రస్తుతం ఈ రెండు సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి. అంతేకాదు ఈ రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే మొదటి పాటలో కేవలం అల్లు అర్జున్ సింగిల్ గా కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన సెకండ్ పాటలో ఇద్దరు జోడిగా కనిపించారు. దాంతో ఆన్ స్క్రీన్ లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బావుంది అంటూ అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇక ఇటీవల విడుదలైన సూసేకి సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా వేదికలో విన్నా కూడా ఈ పాటే వినబడుతుంది. ఇక ఈ పాట సైతం మరో సామి సామి పాట అవడం ఖాయం అని అంటున్నారు జనాలు. చాలా సింపుల్ గా ఉండే స్టెప్స్ తో విడుదలైన ఈ పాట రీల్స్ ఇప్పుడు దాదాపుగా లక్షకి పైగానే దాటేసాయ్. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఈ పాట. ఇక ఇదే విషయాన్ని తాజాగా పుష్ప టిమ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: