మూసి ఉన్న ఆలయాన్ని తెరిచిన నిఖిల్.. వీడియో వైరల్..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఒకేలాంటి కథలు కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలో చేస్తూ టాలీవుడ్ హీరోలో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. స్వామి రారా కార్తికేయ సూర్య ఎక్కడికి పోతావు చిన్నవాడా కేశవ కిరాక్ అర్జున్ సురవరం కార్తికేయ టు 18 సినిమాలతో ఇప్పటివరకు మంచి విజయాలను అందుకుంటు వస్తున్న నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో నిఖిల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని

 అందుకున్నాడో ప్రత్యేకంగా. చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా స్వయంభు దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నిఖిల్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది. అది ఏంటో మీరు కూడా తెలుసుకోండి.. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ

 ఆలయం మూసి ఉంది. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆ ఆలయం శిథిలావస్థకు చేరువలో ఉంది. అయితే తాజాగా ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించాడు నిఖిల్‌. ఆలయాన్ని ఓపెన్ చేయడమే కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన హీరో నిఖిల్‌ను పూలపై నడిపించి ఆహ్వానించారు గ్రామస్తులు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్. ఇందులో గ్రామస్తులందరూ నిఖిల్ ను పూలపై నడిపించడం చూడవచ్చు.  అంతేకాదు ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. నిఖిల్ చాలా మంచి పని చేశాడంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: