ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ పది వ్యూహాలివే.. కూటమికి దెబ్బ అదుర్స్ కదూ!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు కోసం సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే వ్యూహాలను అమలు చేశారు. విశ్వసనీయతతో ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడుతున్న జగన్ ఆ విశ్వసనీయతే తనను ఎన్నికల్లో గెలిపించి విజయ తీరాలకు చేరుస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ తాను మంచి చేస్తేనే ఓటు వేయండని చెబుతూ తన మొదటి వ్యూహాన్ని అమలు చేశారు.
 
జగన్ చేసిన ఈ కామెంట్లతో ప్రజలు బాబు పాలనకు, జగన్ పాలనకు తేడా తెలుసుకోగలిగారు. జగన్ పార్టీని నమ్ముకున్న అభ్యర్థులలో ఎక్కువ మందికి టికెట్లు కేటాయించి ఆ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో సపోర్ట్ ఇచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు మాత్రం చాలామంది అభ్యర్థులను మోసం చేశారనే చెప్పాలి. జగన్ తాను కొన్ని పథకాలకు నగదును పెంచినా ఆ మొత్తాన్ని ఎప్పటినుంచి అమలు చేస్తారో కూడ క్లారిటీగా చెప్పారు.
 
ఈ విషయంలో బాబు మాత్రం మాట మార్చేశారు. కూటమి ఏ పథకం ఎప్పటినుంచి అమలు చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆ విషయాలను చెప్పాలనే ఆలోచన కూడా కూటమి నేతలకు లేదు. జగన్ కు ఇంటాబయటా అంతా శత్రువులే ఉన్నారు. అయినప్పటికీ జగన్ మాత్రం చిరునవ్వు చెదరకుండా ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
 
సంక్షేమం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ సంక్షేమ పథకాలను కచ్చితంగా అమలు చేశారు. పేదలు, నిరుపేదలు అనే తేడాల్లేకుండా అందరి మనస్సులను గెలుచుకున్నారు. అర్హత ఉన్న కూటమి వాళ్లకు సైతం సీఎం జగన్ పథకాలను అమలు చేయడం గమనార్హం. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా పథకాలను అమలు చేయడం జగన్ కు కలిసొస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
సీఎం జగన్ పేదల సంక్షేమమే వ్యూహాలుగా మలచుకుంటూ గెలుపు కోసం తన వంతు కష్టపడుతున్నారు. జగన్ తిరుగులేని సీట్లతో రాష్ట్రంలో మరోసారి సత్తా చాటడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: