కొత్త దర్శకులకి , టెక్నిషన్స్ కి ఎప్పుడు తన ప్రోత్సహాన్ని ఇచ్చే అక్కినేని నాగార్జున గారు మళ్ళీ తన కెరీర్ లో ఇంకో కొత్త డైరెక్టర్ తెలుగులోకి పరిచయం చేస్తున్నారు. హిందీ లో జాన్ డే సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ఆయన వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎసీపీ విజయ్ వర్మగా నాగార్జున టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హిమాలయాస్‌లో జరిగింది. దీంతో సినిమాలో నాగార్జున గారి పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఆయన ఈ సినిమాలో దియామీర్జా తో జంటగా నటిస్తున్నారు. కీలక పాత్రలో సయామీ ఖేర్ నటిస్తున్నారు. ఈ సినిమా పక్క యాక్షన్ థ్రిల్లర్ గా తెరకుఎక్కుతుంది . ఇక కొంచెం షూట్ మిగిలి ఉన్న ఈ సినిమా అది కూడా పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల కి సిద్ధం కాబోతుంది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున ఈ మద్యనే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర కూడా నాగార్జున ఈమధ్యనే పూర్తి చేశారు. ఇక ఇప్పుడు ఆయన ప్రవీణ్ సత్తారు తో ఒక సినిమా చేస్తున్నారు . ఈ మద్యనే ఈ సినిమా పూజ కార్యక్రమం జరుపున్న ఈ సినిమాలో నాగార్జున ఒక రిటైర్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన గరుడ వేగా లో ప్రత్యేకంగా యాక్షన్ ఎపిసోడ్స్ కి నాగ పెరు వచ్చింది. ఇక నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో ఒక రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అని టాక్.ఈ సినిమాతో నాగార్జున గారు ఎంత పెద్ద హిట్ కొట్టబోతున్నారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: