జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

NAGARJUNA NAKKA
జూనియర్ ఎన్టీఆర్ ఇంకా 'ట్రిపుల్ ఆర్' నుంచి బయటకురాలేదు. కానీ అప్పుడే తారక్ తర్వాతి మూవీస్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. యంగ్‌టైగర్ కోసం పక్కభాషల నుంచి కూడా దర్శకులు వస్తున్నారని, లార్జ్‌ స్కేల్‌ మూవీస్ రెడీ అవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

జూ.ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడు. చినబాబు, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ సమ్మర్‌లో స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ మూవీ షూటింగ్‌ ఇంకా స్టార్ట్ కాలేదు గానీ, తారక్‌ నెక్ట్స్‌ మూవీస్‌ అని పెద్ద లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ కూడా ఉన్నాడు.

కన్నడ డైరెక్టర్ 'కెజిఎఫ్' స్టార్ ప్రశాంత్ నీల్‌తో జూ.ఎన్టీఆర్ సినిమా చేస్తాడని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌లో ఈ సినిమా ఉంటుందనే టాక్ కూడా వచ్చింది. అలాగే తమిళ డైరెక్టర్ అట్లీతో కూడా తారక్ సినిమా చేస్తాడని చెప్తున్నారు. ఇప్పటికే డిస్కషన్స్‌ పూర్తయ్యాయని త్వరలోనే అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

జూ.ఎన్టీఆర్ లిస్ట్‌లో నాగ్‌అశ్విన్ సినిమా కూడా ఉందట. ప్రభాస్‌-నాగీ సినిమా పూర్తయ్యాక, తారక్‌ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అయితే తారక్ అశ్వనీదత్‌ బ్యానర్‌లో 'శక్తి' తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. సో ఇప్పుడీ ప్రాజెక్ట్‌ని నాగీ మామ, వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్‌ నిర్మిస్తాడని ప్రచారం జరుగుతోంది.

జూ.ఎన్టీఆర్ లిస్ట్‌లో ఉన్న డైరెక్టర్స్‌ అందరూ పాన్‌ ఇండియన్‌ ఇమేజ్ ఉన్నోళ్లే. లార్జ్‌ స్కేల్‌ మూవీస్‌తో వందలకోట్లు కలెక్ట్ చేశారు. అందుకే ఈ లైనప్‌ గురించి ప్రచారం మొదలవ్వగానే, తారక్ నార్త్‌ మార్కెట్‌ని గట్టిగా ఫోకస్ చేస్తున్నాడనే కామెంట్స్‌ వస్తున్నాయి. ప్రభాస్‌లా తారక్ కూడా బాలీవుడ్‌లో జెండా పాతబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. మరి తారక్‌ బాలీవుడ్‌లో ఎలాంటి ప్లేస్ దక్కించుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: