బుల్లితెర నటుడు వెండితెరపై హీరోగా సక్సెస్ అయ్యాడా.?
యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన "30రోజుల్లో ప్రేమించడం ఎలా" మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు మున్నా అనే కొత్త దర్శకడితో తెరకెక్కించిన ఈ సినిమాను నిర్మాత ఎస్వీ బాబు నిర్మించారు.ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట 'నీలి నీలి ఆకాశం' రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించడం తో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.
ప్రదీప్ కి యాంకర్ గా ఉన్న సూపర్ క్రేజ్ తో పాటు, నీలీ నీలి ఆకాశం అనే పాటతో వచ్చిన క్రేజ్ తో తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ 4 కోట్ల గ్రాస్ సాధించింది.
ఈ సినిమా హిరో,దర్శకులకు మొదటి సినిమా అయినప్పటికీ ఫస్ట్ డే భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన మూవీలో హీరో ప్రదీప్ సక్సెస్ అయ్యాడనే చెప్పచ్చు. నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. ఫస్టాఫ్ కొంత రొటీన్ గానే ఉన్నా , సెకెండాఫ్ ఎమోషనల్‌గా దర్శకుడు స్టోరీని మలిచాడు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ సినిమాలో తన బాణీలతో అందరిని అలరించాలని చెప్పొచ్చు. ఈ సినిమా యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ ఈ మూవీ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది.యాంకర్ ప్రదీప్ హీరోగా మరిన్ని సినిమాల్లో నటించి సక్సెస్ సాధించాలని కోరుకుందాం.