షాక్: అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు..NHRC కీలకమైన ఆదేశాలు జారీ..!
నాలుగు వారాలలో నివేదిక అందించాలంటూ డిజిపి జితేందర్ కు NHRC ఆదేశాలని జారీ చేశారు. డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రెండు తెలుగు రాష్ట్రాలలో వేయడం జరిగింది. ఆరోజు రాత్రి 9:30 హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సంధ్యా థియేటర్లో ఈ సినిమాని అభిమానులతో వీక్షించడానికి అల్లు అర్జున్ వెళ్లారు. అయితే ఈ విషయం విన్న అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్ చూడడానికి గుంపులుగా రావడంతో.. పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకోలేకపోయారట. దీంతో అభిమానుల పైన కూడా లాఠీ చార్జ్ చేసినట్లు సమాచారం.
ఇందులో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడి శ్రీతేజ్ గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.దీంతో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తీరు పైన, థియేటర్ యాజమాన్యం, పోలీసుల వైఫల్యం పైన చాలా విమర్శలు వినిపించాయి. పోలీసులు అభిమానుల మీద లాఠీ ఛార్జ్ చేయడంతో మానవ హక్కుల సంఘం కూడా ఫైర్ అయ్యింది. ఈ ఘటనతో అల్లు అర్జున్ అరెస్టు చేయడమే కాకుండా బెయిలు మీద బయటకి రావడంతో ఆయన పరామర్శించడానికి సినీ సెలబ్రిటీలు వేర్లాడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. హాస్పిటల్ లో ఉన్న పిల్లాడు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పలేదు కానీ అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్లడం పై ఫైరయ్యారు. ఇప్పుడు మరొకసారి NHRC ఆదేశాల మేరకు సంధ్య థియేటర్ ఘటన వైరల్ గా మారుతున్నది.