టీవీ: బిగ్ బాస్-8 విన్నర్ తో కావ్య విడిపోయినట్టేనా.. విలన్ అంటూ ..?

Divya
బిగ్ బాస్ -8 వ సీజన్ కి సంబంధించి నిఖిల్ విన్నర్ అవ్వాలని చాలామంది కోరుకోవడం జరిగింది. అయితే మొత్తానికి నిఖిలే టైటిల్ ని గెలుచుకున్నారు కూడా. ఇలాంటి సమయంలోనే చాలామంది నిఖిల్ , కావ్య కూడా కలవాలని కోరుకున్నప్పటికీ అది జరగలేదు. వీరిద్దరూ బుల్లితెర పైన లవ్ బర్డ్స్ గా మంచి పాపులారిటీ అయితే సంపాదించుకున్నారు. కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న తర్వాత మొదటిసారి ఇటీవలే ఆదివారం విత్ స్టార్ మా పరివార్ లో సందడి చేయడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో కూడా వీరిద్దరూ కలుస్తారని చాలామంది అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూశారు.

 వీరిద్దరూ కలవడం పక్కన పెడితే ఈ షోలో కావ్య ఉండగా నిఖిల్ పెళ్లి అనౌన్స్మెంట్ చేసి ఒక్కసారిగా ఆమెకి షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. తాను రెండేళ్లలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరి మధ్య మరింత దూరం పెరిగినట్టు ఉందని అభిమానులు అయితే తెలియజేస్తున్నారు. ఈ షో కి యాంకర్ గా శ్రీముఖి ఉన్నది.. ఈ షోలో భాగంగా కావ్యాన్ని కూడా శ్రీముఖి ఒక ప్రశ్న అడగడం జరిగింది.. సీరియల్స్ లో ఉండే లేడీ విలన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడైనా వారిని చంపేద్దామని కోపం వచ్చిందా అని అడగగా..?

కావ్య ఇలా మాట్లాడుతూ మంచి ప్రశ్న అడిగారు.. నిజజీవితంలో చాలామంది విలన్లను చూస్తున్నాను కాబట్టే వాళ్లతో పోలిస్తే వీళ్లే బెటర్ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం జరిగింది కావ్య.. దీన్నిబట్టి చూస్తే కావ్య రియల్ లైఫ్ లో కూడా విలన్ ల పేరు ఎత్తింది అంటే కచ్చితంగా అది నిఖిల్ పేరే అయ్యి  ఉంటుందని కావ్య అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. అంతలా నిఖిల్ కావ్యా నీ బాధ పెట్టారా అంటూ మరికొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కలుస్తారనుకున్న నిఖిల్, కావ్య అభిమానులకు ఇలాంటి షాకులు ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: