కొంపతీసి.... ఆయనలా మీరు కూడా...... ఆ విషయంలో దెబ్బేయరుగా .....??
ఇక దీని తర్వాత కే జి ఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ, వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ అలానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ చేయనున్నారు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమాల షూటింగ్ లకు సంబంధించి ప్రభాస్ పక్కాగా డేట్స్ కేటాయించారని అంటున్నారు. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానిని నుంచి మరొకటి భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్నాయట. అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ త్వరలో రిలీజ్ అవుతుంది అంటూ ఇటీవల దర్శకుడు రాధాకృష్ణ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు ఒక అప్ డేట్ ఇచ్చారు.
అయితే ఫ్యాన్స్ ఈ మూవీ టీజర్ పక్కాగా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతుందని భావించారు, కానీ అది జరగకపోవడంతో వారు పూర్తిగా నిరాశకు గురయ్యారు. ఇక ప్రస్తుతం నాగ అశ్విన్, తను ప్రభాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ఈనెల 29న అలాగే వచ్చే నెల 26న రెండు భారీ అప్డేట్స్ రాబోతున్నాయని ఒక అభిమాని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం గా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సమాధానం ఇచ్చారు. అయితే ఈ విషయమై పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ, కొంపతీసి మీరు కూడా రాధాకృష్ణ గారి మాదిరిగానే అప్డేట్ విషయమై దెబ్బేయరు కదా అశ్విని గారు అంటూ తమ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగ అశ్విన్, ప్రభాస్ సినిమాకు సంబందించిన ఆ అప్ డేట్స్ ఏంటో తెలియాలి అంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.....!!