ఎన్టీఆర్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
అయితే.. ఈ మూవీని ఎప్పుడు విడుదల చేయనున్నారనే విషయం ఆసక్తిగా మారింది. మొదట్లో కొన్ని డేట్స్ అనుకున్నప్పటికీ కుదర లేదు. దీంతో.. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కరోనాా భయం ఇంకా తొలగిపోలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వాాలి. ఇవన్నీ పూర్తయ్యే సరికి సమ్మర్ వచ్చేస్తుంది. అప్పటికి అన్నిపను లూ అయినప్పటికీ.. సినిమాాను మాాత్రం దసరాా సీజన్ కే బరిలో నిలపాలని యోచిస్తున్నాడట దర్శక ధీరుడు.
ఇక ఈ సినిమా తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్.. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా అరడజనుకు పైగా దర్శకులు ఈయనతో సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ జాబితాలో మరో దర్శకుడు వచ్చి చేరాడు. కార్తీ హీరోగా తమిళంలో ఖైదీ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం విజయ్ హీరోగా 'మాస్టర్' సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం కమల్ హాసన్ తో ఒక సినిమాను చేసే పనిలో లోకేష్ కనగరాజ్ ఉన్నాడు. ఈయన ఇటీవల ఎన్టీఆర్ తో సినిమా విషయమై చర్చించాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలు అయినా నిజం అయితే బాగుండు అని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.