కన్నడ హీరో యాష్ నటించిన కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమా సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. కన్నడ తో పాటు పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రిలీజ్ అయి ఎంతో గొప్ప బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. హోమ్ బలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీగా తెరకెక్కిన ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2. మొదటి భాగాన్ని మించేలా మరింత భారీగా గ్రాండ్ లెవెల్ లో దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతలు కూడా మొదటి భాగాన్ని మించేలా ఈ రెండో భాగానికి అత్యధిక ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆధీరా అనే విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవీనాటాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజ నటులు కూడా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ పూర్తయింది, జనవరి 8న యాష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లుగా టాక్. నిజానికి ఈ వార్త వైరల్ టానికి ప్రధాన కారణం గూగుల్లో కే జి ఎఫ్ చాప్టర్ 2 అని టైప్ చేస్తే అందులో నటించిన ప్రధాన తారాగణం లో నందమూరి బాలకృష్ణ పేరు కూడా గమనించవచ్చు.
సినిమాలోని కీలకమైన పాత్రలో ఒకటయిన ఇనాయత్ ఖలీల్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు అంటూ కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్రబృందం లో బాలయ్య పేరు కూడా చూపిస్తుంది. దీనితో అందరూ బాలయ్య కూడా ఈ సినిమాలో ఖలీల్ పాత్ర చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై స్పందించిన కేజీఎఫ్ యూనిట్ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అది సాంకేతిక తప్పిదం మాత్రమేనని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తమ సినిమా రిలీజ్ అనంతరం అభిమానులను, ప్రేక్షకులను అలరించడం తో పాటు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోవడం ఖాయమని కేజిఎఫ్ మూవీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది......!!