'వకీల్ సాబ్' పై పూర్తి క్లారిటీ వచ్చేది అప్పుడేనట ....??

GVK Writings

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు, బోనీ కపూర్ ల నిర్మాణంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా మూవీ వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ పవన్ కి జోడీగా యాక్ట్ చేస్తుండగా ప్రకాష్ రాజ్, అంజలి, మురళి శర్మ, నివేదా థామస్ ఇతర పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మగువ మగువ సాంగ్, అలానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రెండూ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుని ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన కోర్ట్ డ్రామా మూవీ పింక్ కి అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయింది. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తరువాత జరుగనున్నట్లు టాక్.
అయితే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ అతి త్వరలో రిలీజ్ అవుతుంది అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతుండగా, టీజర్ తో పాటు సినిమా యొక్క రిలీజ్ డేట్ ని నూతన సంవత్సరం రోజున యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు టాక్. అందుకే యూనిట్ ఇప్పటివరకు వకీల్ సాబ్ సంబంధించి ఎటువంటి సమాచారం రిలీజ్ చేయలేదని, సరిగ్గా ఆ రోజు తరువాత వకీల్ సాబ్ నుండి పక్కాగా అప్ డేట్స్ ఉంటాయని కూడా టాక్. మొత్తంగా ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ న్యూస్ అనే చెప్పాలి.... !!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: