నువ్వా.. నేనా.. అనేలా సీనియర్ హీరోలు..!
టాలీవుడ్ టాప్ హీరోలలో చిరంజీవి, బాలయ్యల రూటే సెపరేట్. బాక్సాఫీస్ షేక్ చేయడంలో వీరెప్పుడు ముందు వరుసలోనే ఉంటున్నారు. తాజాగా మరోసారి బాక్సాఫీస్ ను తమ తఢాకా ఏంటో చూపించాలని సరదా పడుతున్నారు. దానిలో భాగంగా ఈ సమ్మర్ ను వేదికగా చేసుకున్నారు. అయితే ఈ సమరంలో ముందుగా రావడానికి చిరంజీవి తన ఆచార్యను సిద్ధం చేస్తున్నాడు.
చిరంజీవితో కొరటాల తన ఆచార్యను ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. కథ విషయంలో ఎంతో కసరత్తు చేసి మరీ సెట్స్ మీదకు తీసుకుపోయారు. దీనికి తోడు చెర్రీ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉండడంతో సినిమాకు క్రేజ్ వస్తోంది. కరెక్ట్ గా ఇదే సమయంలో బాలయ్య బోయపాటితో ముచ్చటగా మూడోసారి వస్తోన్న సినిమా మార్చికి షూట్ పూర్తి చేసుకుని మన ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాను రిలీజ్ కు సమ్మర్ నే ఎంచుకున్నారు. అందులోనూ కొరటాలకు పోటీగా బోయపాటి తన సినిమాను వదలాలని డిసైడ్ అయ్యాడు.
ఒక రకంగా పైకి చెప్పుకోవడానికి ఇది చిరంజీవి, బాలయ్యల ఫైటింగ్ మాదిరిగా కనిపించానా.. ఇంటర్నల్ గా కొరటాల, బోయపాటిల ఇష్యూ లాగానే కనిపిస్తుందంటున్నారు. ఎప్పటినుంచో ఇగోలతో క్లాష్ అవుతోన్న వీరిద్దరు ఈ సారి తమ హీరోల సినిమాలతో ఇలా తమ ఇగోలను శాటిస్ ఫై చేసుకోవాలని చూస్తున్నారని పరిశ్రమలో టాక్ అయితే నడుస్తుంది. మొత్తానికి సీినియర్ హీరోలు సమ్మర్ లో ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు.