చిన్న రౌడీ కి మిడిల్ క్లాస్ హిట్ వచ్చిందా..?

P.Nishanth Kumar
దొరసాని సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా తోనే నటనకు ఆస్కారం ఉన్న చిత్రం లో నటించి ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు మలుచుకున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ లోకి వచ్చిన ఆనంద్ తన రెండో ప్రయత్నంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా ను చేస్తున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా పాటలు, ట్రైలర్ లు సినిమా పై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.  భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా బిగిల్ సినిమా లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం నవంబర్ 20న  ప్రముఖ ఓటీటీ అమెజాన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది..
ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..ఈ సినిమా మొత్తాన్ని ఆనంద్ దేవరకొండ తన భుజాల మీద వేసుకుని నడిపించాడు.. సినిమా మొత్తం ఆనంద్ చుట్టే తిరుగుతుంటుంది. రాఘవ పాత్ర కు ఊపిరిపోసినట్లే నటించాడు. తొలి సినిమా కి ఈ సినిమా కి నటన లో చాలా పరిణితి కనపరిచాడు. సొంతంగా హోటల్ పెట్టుకొని జీవితంలో సెటిల్ అవ్వాలని  ఓ కుర్రాడు పడే ఆరాటం ఆనంద్ లో కొట్టిచ్చినట్లు కనపడింది.. మన పక్కింటి అబ్బాయి ని చూసినట్లే ఉంది సినిమా చూస్తున్నంత సేపు. ఎమోషనల్ సీన్స్ లో, కామెడీ టైమింగ్ పట్టడంలో ఆనంద్ కి పోటీ ఎవరు లేరు.సగటు పక్కింటి కుర్రాడిగా కనిపించే ఫీచర్స్ ఉండటంతో యూత్ కి తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు ఆనంద్. ఇందులోనూ రాఘవ అనే మంచి  పాత్రలో చెలరేగిపోయాడు.
ఇక వర్ష బొల్లమ్మ ఈ సినిమా లో ఎంతో న్యాచురల్ గా నటించింది.. తెలుగులో రెండో సినిమా చేస్తున్న వర్ష ఆనంద్ తో మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ చేసింది.. ఈ పెయిర్ ని చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది.. కొన్ని కొన్ని సీన్స్ లలో వర్ష అదరగొట్టింది.  స్నేహితుడి పాత్ర చేసిన చైతన్య గరికపాటి మంచి కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఈ పాత్ర కు తాను తప్ప మరెవరు సూట్ ఎవరు అనే రేంజ్ లో నటనను కనపరిచాడు. ఇక ఈ సినిమా లో ముఖ్యంగా చెప్పాల్సింది హీరో తండ్రి పాత్ర చేసిన గోపరాజు రమణ. రియలిస్టిక్ గా ఎంతో సహజంగా తన పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆనంద్, రమణ లమధ్య మంచి ఫన్ జెనరేట్ అయ్యింది.. మిగితా పాత్ర దారులు తమకు శక్తికి మంచి మంచి నటన కనపరిచారు.  ఈ సినిమా మొదటినుంచి కథ బలం ఉన్న చిత్రం గా చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.. కథ ను అంత నమ్మారు కాబట్టే సినిమా కి ఇప్పుడు అంత మంచి పేరొచ్చింది..ఓ మంచి కథ ను రాసి దాన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించిన విధానం చూస్తుంటే వినోద్ స్టార్ డైరెక్టర్ అయ్యే సూచనలు చాలానే కనిపిస్తున్నాయి.  ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి పాత్రలు సన్నవేశాలు జరిగినవి కదాని పదే పదే మెదడులో తడుతూనే ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: