మొత్తానికి .... పవన్ కళ్యాణ్ కోసం చేయడానికి సిద్దమైన రానా ....??
కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక దీనితో పాటు మరోవైపు క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్న పవర్ స్టార్, దాని అనంతరం మరొక మూడు సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా వాటిలో ఒకటి మలయాళ సూపర్ స్టార్ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. కాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు సరిసమానంగా ఈ సినిమాలో సాగే మరొక ముఖ్య పాత్ర కు సంబంధించి ఇప్పటికే పలువురు నటుల పేర్లు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి దగ్గుబాటి హీరో రానా ఆ పాత్ర చేసే అవకాశం కనపడుతోంది.
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా అయ్యప్పనుం కోషియం సినిమా విషయమై దర్శకనిర్మాతలు తనను సంప్రదించిన మాట వాస్తవమే నని, అలానే అతి త్వరలో ఆ సినిమా చేస్తున్నానో లేదో పూర్తి వివరాలు వెల్లడిస్తానని రానా అన్నారు. ఇక నేటి ఉదయం ఈ సినిమా చేయడానికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూవీ యూనిట్ కి కాల్షీట్స్ కేటాయించారని, పవన్ కళ్యాణ్ తో తనకు మంచి అనుబంధం ఉండడంతో పాటు పాత్ర కూడా తనకు ఎంతో నచ్చడంతో రానా ఈ సినిమా చేస్తున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల అయ్యేవరకు వెయిట్ చేయకతప్పదు...!!