'ఆర్ఆర్ఆర్' నెక్స్ట్ అప్ డేట్ అప్పుడేనట .....??

GVK Writings
టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ భారీ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో అత్యంత గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ కి ముందు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాదులో ప్రారంభం అవ్వగా అతి త్వరలో దాన్ని పూర్తి చేసి ఆపై సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలెట్టాలని చూస్తుందట యూనిట్.

ఇకపోతే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ ఇద్దరు హీరోల పాత్రల యొక్క పరిచయ టీజర్లు యూట్యూబ్ లో రిలీజ్ అయి పలు సంచలనాలు క్రియేట్ చేసి సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచడం జరిగింది. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి లో కానీ లేదా జూన్లో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు సంబంధించి అధికారిక థియేట్రికల్ ట్రైలర్ రాబోయే దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరోవైపు థియేట్రికల్ ట్రైలర్ కు సంబంధించి అతి త్వరలో పనులు ప్రారంభించనున్న యూనిట్ దానిని పక్కాగా దీపావళికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. సముద్రఖని, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ, శ్రియ శరణ్ వంటి ఇతర నటులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రేపు రిలీజ్ తర్వాత ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరి కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: