ఆర్జీవీ పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్.. ప్రవన్ కల్యాణ్ గ్లాసు పగిలిపోయిందిగా...!

Chakravarthi Kalyan

అనుకున్నట్టుగానే ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. ముందుగా 25 రూపాయల టికెట్‌తో ట్రైలర్ చూపించాలని ఆర్జీవీ అనుకున్నా... చివరకు అది లీకైందని.. అందుకే యూట్యూబ్ లో విడుదల చేస్తున్నామని ఆర్జీవీ ముందుగానే  ప్రకటించారు. మొత్తానికి ట్రైలర్ వచ్చేసింది. 

 

ఇక ట్రైలర్ ఊహించినట్టుగానే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు రాత్రి అంటూ ఓ దృశ్యం చూపించారు. ఎన్నికల ఫలితాలు టీవీల్లో ప్రకటించడం.. దానిపై ప్రవణ్ కల్యాణ్ టెన్షన్.. చివరకు ఆవేదనతో టీవీ పగలకొట్టేయడం చూపించారు. ఒక్క సీటు కూడా రాలేదా అని ప్రవణ్ కల్యాణ్ అనే వ్యక్తి ఆవేదనగా అడగటం..  ఒకటి వచ్చింది సార్ కానీ మీకు ఒక్కటి కూడా రాలేదు.. అని అనుచరులు చెప్పడం విశేషం.

 


చివరకు ప్రవణ్ కల్యాణ్ అనే వ్యక్తి.. ఓ దర్శకుడిని చెంపపై కొడతాడు... ఇన్ని డైలాగుల్లో ఏదీ వర్కవుట్ కాలేదా అని ఆవేశంగా అడుగుతాడు.. ఆ తరవాత ప్రవణ్ కల్యాణ్ అనే వ్యక్తి సోదరుడు తెరపైకి వస్తాడు.. ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పరా.. నువ్వు పవర్ స్టార్ అయ్యింది.. కానిస్టేబుల్ కొడుకుగానా.... నా తమ్ముడిగానా... అంటూ నిలదీస్తాడు. 

 


ఇక ఆ తర్వాత ప్రవణ్ కల్యాణ్... చంద్రబాబును పోలిన వ్యక్తితో మాట్లాడతాడు.. మిమ్మల్ని నమొద్దు.. నమ్మొద్దని చాలా మంది చెప్పారు సార్..కానీ నేను వినలేదు.. ఇక వెళ్లండి సార్ అంటూ ప్రవణ్ కల్యాణ్ ఆయనపై మండిపడతాడు..  ఆ తర్వాత కత్తి మహేశ్ ప్రవణ్ కల్యాణ్ తో ఇంటర్వ్యూ  చూపించారు. చివర్లో బండ్ల గణేశ్ ను పోలిన వ్యక్తి తో ప్రవణ్ కల్యాణ్ సంభాషణ.. ఆ తర్వాత  నేను రాజకీయాల్లో ఉండాలా అక్కర్లేదా.. అని డైలమాలో ఉంటే... ఓ వ్యక్తి వస్తాడు.. ఆయనెవరన్నది తెలీదు... చివరకు టైటిల్ వచ్చి.. గాజు గ్లాస్ పగిలిపోయింది.. ఇదీ వర్మ ట్రైలర్ కథ. 

 

" height='150' width='250' src="https://www.youtube.com/embed/MSY3qqh4K3I" width="560" height="314" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: