బాలకృష్ణను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ... దబిడి దిబిడే....?
స్టార్ హీరోలలో బాలకృష్ణ, దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఎవరికి వారు ప్రత్యేకం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతుందంటూ గాసిప్స్ వినిపించాయి. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. గత కొంతకాలంగా రాజకీయ, సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్న వర్మ తాజాగా బాలకృష్ణను టార్గెట్ చేసాడని..... ఆయనను దృష్టిలో పెట్టుకుని నిజ జీవిత సన్నివేశాలతో సినిమా తీయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఏపీలో జగన్ అధికారంలోకి రాక ముందు నుంచి రామ్ గోపాల్ వర్మ ఆయన వ్యతిరేకులను టార్గెట్ చేసి సినిమాలు తీస్తున్నారు. అమ్మరాజ్యంలో కడపబిడ్డలు, పవర్ స్టార్ ఈ కోవకు చెందిన చిత్రాలే. పవన్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన తీస్తున్న పవర్ స్టార్ సినిమాపై పీకే అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా, నందమూరి కుటుంబాలను టార్గెట్ చేసి వర్మ సినిమాలు తీసి ఘర్షణలు పెట్టుకుంటున్నారు.
దాదాపు పదిహేనేళ్ల క్రితం బాలకృష్ణ నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడిపై కాల్పులు జరపడం సంచలనమైంది. అనంతరం బాలకృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే కాల్పులు జరిపాడని సాక్ష్యాలు ఉండటంతో ఆయన ఈ కేసు నుంచి బయటపడ్డారు. చంద్రబాబు బాలయ్యను రక్షించడం కోసం వైయస్సార్ సాయం కోరారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అనంతరం ఆ కేస్ క్లోజ్ అయింది.కోలుకున్న తరువాత బెల్లంకొండ సురేష్ తనపై ఎవరు కాల్పులు జరిపారో తెలియదని వ్యాఖ్యలు చేశారు.
తాజాగా వర్మ ఆ రాత్రి ఏం జరిగింది....? అనే విచిత్రమైన టైటిల్ తో బాలయ్య కాల్పుల గురించి సినిమా తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వివాదాలను క్యాష్ చేసుకోవాలని భావించే వర్మ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ సీమాను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే టీడీపీ, జనసేన అభిమానులు మాత్రం ఏపీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆర్జీవీ సినిమాలు తీయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.