టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్.. ఒకప్పుడు ఇలా..!

shami

టాలీవుడ్ లో ఇప్పుడున్న కమెడియన్స్ లో మోస్ట్ వాంటెడ్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు ఒక్కటే అతడే వెన్నెల కిశోర్. వెన్నెల సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కిశోర్ తన మొదటి సినిమానే స్క్రీన్ నేం గా మార్చుకుని సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల దగ్గర నుండి యువ హీరోల సినిమాల దాకా హీరో ఎవరైనా సరే కమెడియన్ గా మాత్రం వెన్నెల కిశోర్ ఉండాల్సిందే. ఒకప్పుడు సునీల్ కు ఉన్న ఫాలోయింగ్ క్రేజ్ ఇప్పుడు వెన్నెల కిశోర్ కు వచ్చాయని చెప్పొచ్చు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న వెన్నెల కిశోర్ తన అప్డేట్స్ ను ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం లో పెడుతూ అక్కడ కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరిస్తుంటాడు.

 

ఇన్ స్టాగ్రాం లో 1 మిలియన్ ఫాలోవర్స్ దాకా ఉన్న వెన్నెల కిశోర్ కు లేటెస్ట్ గా వాళ్లందరికి సర్ ప్రైజ్ ఇస్తూ ఒక పిక్ షేర్ చేశాడు. అదెప్పటిదో కాని అందులో వెన్నెల కిశోర్ బక్కపలచగా ఉన్నాడు. మొఖంలో పెద్దగా మార్పు రాలేదు కాని వంటితీరు పూర్తిగా మారిపోయింది. అప్పట్లో ఇలా ఉన్నాను అంటూ వెన్నెల కిశోర్ షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ప్రతి స్టార్ హీరో సినిమాలో స్నేహితుడి పాత్రలోనో.. ఏదో ఒక స్పెషల్ పాత్రలోనో అలరించే వెన్నెల కిశోర్ మరి కొన్నాళ్లు తన ఫాం కొనసాగించేలా ఉన్నాడు.

 

కమెడియన్ గా కొద్దిగా క్రేజ్ రాగానే అతని లీడ్ రోల్ లో కూడా సినిమా ఆఫర్లు వచ్చే ఉంటాయి. కాని అలా కమెడియన్ కం హీరో గా ప్రయత్నాలు చేసిన వారనా వెనక్కి తగ్గారు. అయితే వెన్నెల కిశోర్ మాత్రం అప్పట్లో ఓ సినిమాలో లీడ్ రోల్ చేశాడు కాని తను కూడా స్టార్ హీరోల్లా ఫైట్లు, డ్యాన్సులు చేయదలచుకోలేదు. మొత్తానికి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కొనసాగుతున్న వెన్నెల కిశోర్ ఒకప్పటి ఫోటోతో అందరికి సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చాడు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Those days in michigan Life had just begun Blizzards were barely cold Gizzards were cheaply sold #RichInDollarStoreDays 🤣

A post shared by {{RelevantDataTitle}}