కొత్త లుక్ తో రెచ్చగొడుతున్న యాంకర్ అనసూయ..!
తెలుగు బుల్లితెర లో యాంకర్లు మంచి స్పీడ్ లో ఉన్నారు. ప్రోగ్రాం ల మీద ప్రోగ్రాం లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు సిల్వర్ స్క్రీన్స్ పైన కూడా ఈ అందాల భామలు తళుక్కుమంటున్నారు. చేతికందిన అవకాశాలు అందిపుచ్చుకొని షూటింగ్ లలో బిజీ బిజీ అయిపోయారు. అయితే ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ ఉండటం వలన అటు వెండి తెర ఇటు బుల్లి తెర రెండు ఇండస్ట్రీ లకు షూటింగ్ లు లేకుండా పోయాయి. ఇండస్ట్రీ వాళ్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. దాదాపు రెండు నెలలు పైనే ఇళ్లకే పరిమితమైపోయారు.