29ఏళ్ళ యువకుడితో 44ఏళ్ళ సుస్మితాసేన్‌ లవ్వాయణం..!

Kothuru Ram Kumar

44 ఏళ్ల బాలీవుడ్ నటి సుస్మితాసేన్ రోహ్మాన్‌ షాల్‌ అనే 29 ఏళ్ల యువకుడితో ఒకటిన్నర సంవత్సరాల నుండి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంది. ఐతే వీళ్ళిద్దరూ ఇంస్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ లు పంపకుంటూ పరిచయం పెంచుకున్నారు. తదనంతరం అతడిని వయసు అడగకుండానే సుస్మితాసేన్‌ పీకల్లోతు ప్రేమలో మునిగింది. ఏదో ఒక సందర్భంలో నీ వయసు ఎంత అని రోహ్మాన్‌ షాల్‌ ని అడిగినప్పుడు అతడు మాత్రం సమాధానం చెప్పకుండా ఆమె దృష్టి మరల్చేవాడట. అయితే ఒకానొక సందర్భంలో తప్పక తన వయసు 29 సంవత్సరాలు అని చెప్పగా ఆమె ఒక్క సారిగా షాక్ అయిందట. ఆ తర్వాత తేరుకొని ప్రేమకు వయసు అడ్డు రాకూడదు. మన ఇద్దరిదీ వయో భేదాలు లేని స్వచ్ఛమైన ప్రేమ అంటూ అతడితో తన లవ్ ట్రాక్ కొనసాగిస్తూ ఉందట. 


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన డేటింగ్ విషయాల గురించి మాట్లాడుతూ... రోహ్మాన్‌ షాల్‌ చాలా మంచివాడు. అతనిలో ఆ మంచితనం, దయా గుణాలు నాకు బాగా నచ్చుతాయి. మిమిద్దరం కలవాలని ఆ దేవుడు నిశ్చయించాడు. అతను నాకంటే వయసు తక్కువే ఉంటుందని నాకు తెలుసు కానీ ఎంత వయస్సు అనేది ఖచ్చితంగా తెలియలేదు. నీ వయసెంత అని అడిగినప్పుడు తాను 29 అని చెప్పాడు కానీ అప్పుడు మేము మాట్లాడిన సంభాషణలో ఎక్కువగా వయసు గురించి మాట్లాడలేదు. కానీ ఒకరోజు తను నాకు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ లో తాను రాసిన పదాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వెంటనే థాంక్యూ అని రిప్లై పంపాను. ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతూ పోయి ప్రియమైన ప్రేమ పుట్టుకొచ్చింది', అని ఆమె చెప్పుకొచ్చింది. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
“Here’s another {{RelevantDataTitle}}