టాలీవుడ్ లో టాప్ విలన్లు...

siri Madhukar

టాలీవుడ్ లో ఒకప్పుడు తెలుగు నటులే ఎక్కువగా విలన్లుగా నటించారు.  ఎస్వీ రంగారావు, రాజనాల, నాగభూషం, ఆర్ నాగేశ్వరరావు మరికొంత మంది ప్రతినాయకులుగా నటించారు.  ఎన్టీఆర్ వర్సెస్ రాజనాల ఎక్కువగా ఉన్నాయి.  ఎస్వీ రంగారావు అన్ని రకాల పాత్రలు పోషించారు.  నాగభూషనం క్యారెక్టర్ పాత్రలతో పాటు ఎన్నో విలన్ పాత్రల్లో నటించారు.  ఆ తర్వాత మోహన్ బాబు, రావు గోపారావు, నూతన ప్రసాద్, సుధాకర్, ప్రసాద్ బాబు, కోట శ్రీనివాసరావు లు విలన్లుగా నటించారు.  

 

అయితే మోహన్ బాబు కేవలం విలన్ గా మాత్రమే కాదు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక 90వ దశకంలో తెలుగు విలన్లు తక్కువయ్యారు.. మొత్తం బాలీవుడ్ నుంచి వచ్చిన నటులే ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు.  నాజర్, ముఖేష్ రుషి, రాహూల్ దేవ్, షియాజీ షిండే.. ప్రదీప్ రావత్ ఇలా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటులు విలన్లు గా దర్శనం ఇచ్చారు.  

 

రావు గోపాల రావు : ఆయన కంఠం వింటేనే విలనీజం ఇలా ఉంటుందా అనిపించేది.. రావు గోపాల రావు ప్రతినాయకుడిగానే కాదు అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.

నూతన్ ప్రసాద్: దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందీ అంటూ తనదైన కామెడీ మార్క్ తోనే కాదు.. విలనీజాన్ని కూడా చూపించారు.. చనిపోయే ముందు చాలా కష్టాలు పడ్డారు. 

కోటా శ్రీనివాస రావు : అచ్చమైన తెలుగు విలన్ గా కనిపిస్తూ.. మంచి కమెడియన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం విలన్ పాత్రలు తగ్గించి తాతయ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.  కోటా శ్రీనివాస రావు తెలుగు సినిమాల్లో టాప్ హీరోలతో నటించారు.

నాజర్ : నాజర్ బహుభాషా భారతీయ చలనచిత్ర నటుడు, దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు ప్లేబ్యాక్ గాయకుడు,  ఎక్కువగా  దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో నటించారు. ప్రస్తుతం తండ్రి, మామ, తాత పాత్రల్లోనటిస్తున్నారు. 

ముఖేష్ రుషి : బాలీవుడ్ నుంచి వచ్చిన విలన్.. తెలుగు లో టాప్ హీరోలందరికి విలన్ గా నటించారు.  కేవలం విలన్ గానే కాకుండా క్యారెక్టర్ పాత్రల్లో కూడా నటించి మెప్పించారు. ఈ మద్య తెలుగు సినిమాలకు దూరమయ్యారు.

షియాజీ షిండే: దక్షిణ భారత సినిమాలోని టాప్ విలన్లలో ఒకరు గా ఉన్నారు.  తెలుగు లో ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు.  100 కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన వివిధ భాషల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: