ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల భేటీ... బాలయ్యకు మళ్లీ దక్కని ఆహ్వానం?

Arun Showri Endluri
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమ పై విపరీతమైన ప్రేమ కలిగింది. గతంలో ఇండస్ట్రీలోని పెద్దలని పిలిచి వైజాగ్ లో కూడా పటిష్టమైన తెలుగు చలన చిత్ర పరిశ్రమను స్థాపించేందుకు కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు. జగన్ తాజాగా కరుణ సంక్షోభం కారణంగా భారీగా దెబ్బతిన్న ఇండస్ట్రీని గాడిలో పెట్టేందుకు తన వంతు సహాయంగా రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలు అన్నింటిని రూపాయి ఖర్చు లేకుండా షూటింగ్ లకు వాడుకోమని జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా జగన్ మోహన్ రెడ్డిని తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు కలిసే ముహూర్తం ఖరారు అయిపోయిందట. ఈనెల 9వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్మెంట్ లభించినట్లు సినీ వర్గాల్లో టాక్. ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, స్టూడియా, డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ నుంచి ఇద్దరు ఇద్దరు చొప్పున, అలాగే ఫెడరేషన్, మా, డైరక్టర్ విభాగాల నుంచి ఇద్దరేసి వంతున సీఎం జగన్ ను కలుస్తారుట. చిరు, నాగ్ తో పాటు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, మా తరపున నరేష్, జీవిత లు జగన్ ను కలిసే వారిలో ఉన్నట్లు బోగట్టా.

ఈ మధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ తో వీరు భేటీ అయ్యారు.. మరియు ఆసమావేశానికి బాలయ్య కు పిలుపు లేకపోవడం, దానిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ తరువాత విమర్శల పరంపర తెలిసిందే. అయితే ఈ సారి కూడా నందమూరి బాలకృష్ణను ఈ మీటింగ్ కి ఎవరు ఆహ్వానించలేదని తెలుస్తోంది బాలకృష్ణ సినీ నటుడే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే.

ఇక జగన్ ను కలిసేందుకు వారందరూ వస్తున్నారు అన్న విషయం ఇప్పటికే ఖరారు అయిపోయింది. మరి బాలకృష్ణను పిలవకపోతే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఏ విధంగా బాలయ్య రెచ్చిపోతారు అన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: