పాపం సల్మాన్ ఖాన్ కి ఈ సారి ఆ సందడి లేనట్టే...!
2009 లో రిలీజ్ అయిన వాంటెడ్ సినిమా నుంచి ఈ ఈద్ సెంటి మెంట్ నిఫాలో అవుతున్నాడుసల్మాన్ 2010 లో బ్లాక్ బస్టర్ హిట్ దబంగ్, 2011 లో బాడీ గార్డ్, 2012 లోకత్రినా కైఫ్ తో ఏక్ థా టైగర్ సినిమాలు ఈద్ కి రలీజ్ చేశాడు సల్మాన్. మళ్లీ 2014 లో సూపర్ హిట్ మూవీ కిక్ , 2015 లో రికార్డులు తిరగరాసిన బజరంగీ భాయ్ జాన్, 2016 లో సుల్తాన్ సినిమాలు కూడా రంజాన్ సీజన్ లోనే విడుదల చేశాడు. 2017 ఈద్ కి ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ చేస్తే..2018 లో భారీ బడ్జెట్ మూవీ రేస్ 3 రిలీజ్ చేశాడు. 2019 లో భారత్ సినిమా ని ఈద్ కే రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సల్మాన్ ఖాన్. 2020 ఈ సంవత్సరం మే 22 న ఈద్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన రాధే సినిమా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయ్యేఛాన్సుండడంతో ఈద్ కి రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబందించి ఇంకా రెండు పాటలతో పాటు .. ఒక వారం ప్యాచ్ వర్క్ షూటింగ్, ఎడిటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ మిగిలి ఉంది.ఇంకా సినిమాకు సంబందించి పనలు మిగిలి ఉండడంతో పాటు ..అసలు ఈ కరోనా ఎప్పుడు పోతుందో, లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో అన్నదాని మీద ఇప్పటివరకూ ఎలాంటి న్యూస్ లేకపోవడంతో సినిమా మే 22 ఈద్ కి రావడం కష్టమే అనుకుంటున్నారు అందరూ.