ఆంధ్రప్రదేశ్ గురించి విపరీతంగా ఆరా తీస్తున్న కేంద్రం..! ఆ రెండిటి వల్లే....

Arun Showri Endluri
మొత్తం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారతదేశంలో కూడా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ విపరీతంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపద్యంలో కేంద్ర సర్కారు మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మన దేశంలో కరోనా వ్యాప్తిచెందిన కొత్తల్లో ఏపీలో పెద్దగా కేసులు నమోదు కాకపోయినా ఇప్పుడు పాజిటివ్ కేసులు సంఖ్య 500 దాటిపోయింది. రాష్ట్రంలో నలుమూలలా కరోనా విస్తరిస్తూ ఉండగా ఆ రెండు జిల్లాల్లో మాత్రం కరోనా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది ఇప్పుడు దేశం మొత్తం ఏపీ లోని ఆ రెండు జిల్లాల వైపు వింతగా చూస్తూ ఉండటం గమనార్హం.

అసలు ఆ రెండు జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా అక్కడి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అన్న విషయంపై యావత్ భారత దేశం దృష్టిని కేంద్రీకరించింది. అక్కడ తీసుకుంటున్న చర్యలపై అన్ని విభాగాల నిపుణుల నుండి ప్రభుత్వ పెద్దల వరకు జిల్లా కలెక్టర్లను కూడా అంతా ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కో అమిత వేగంతో కరోనా వ్యాప్తి చెంది మూడు వారాలు కావస్తున్నా ఆ రెండు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఎవరినైనా ఆశ్చర్యానికి గురి చేయాల్సిందే.

ఆ రెండు జిల్లాలు శ్రీకాకుళం మరియు విజయనగరం అని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాం. ఏపీ సరిహద్దున ఉన్న ఈ రెండు జిల్లాలకు పొరుగున ఉన్న ఒడిస్సా మరియు చత్తీసుగఢ్ రాష్ట్రాల కేసులు వ్యాప్తి చెందకుండా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అలాగే విజయనగరాన్ని కూడా కరోనా ఫ్రీ జిల్లాగా చేయడంలో ఆ జిల్లా కలెక్టర్హరి జవహర్ లాల్ తో పాటు మొత్తం జిల్లాఅధికారుల శ్రమ ఎంతో ఉంది.

ఈ నెల 20 వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్ గా కేంద్రం ప్రకటిస్తుందన్న సమాచారం నేపధ్యంలో ఏపీలో గ్రీన్ జోన్ జిల్లాలుగా రికార్డు నెలకొల్పేందుకు ఈ రెండు జిల్లాల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: