"ఓటిటి" లో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న "ప్రేమలు"..!

Pulgam Srinivas
నస్లెన్ కె గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన పాత్రల్లో ప్రేమలు అనే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. గిరీష్ ఎడి దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది. పెద్దగా అంచనాలు లేకుండా మలయాళం లో రూపొందిన ఈ సినిమా చిన్న సినిమాగా మలయాళం లో మాత్రమే మొదట విడుదల అయింది. ఇక విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మొదలు అయింది. దానితో మలయాళ భాషలో ఈ సినిమా భారీ కలక్షన్ లను వసులు చేసి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
 


ఇలా ఈ మూవీ మలయాళ భాషలో భారీ కలక్షన్ లను వసూలు చేస్తూ ఉండడంతో ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం మొదలు అయింది. దానితో ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.  బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా అలరించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ "ఓ టి టి" హక్కులను ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల నుండి ఈ సినిమాను ఆహా సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 125 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు ఆహా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: