బాండ్‌ గర్ల్ హానర్‌ బ్లాక్‌మన్‌ మృతి

JSR
ఓల్డెస్ట్ బాండ్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న హానర్‌ బ్లాక్‌మన్‌ మృతి చెందారు. ఎక్కువగా బాండ్ చిత్రాల్లో హీరోగా నటించిన సీన్ కానరీకి జోడిగా నటించిన హానర్ 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా తెలిపారు.

ఈ సందర్భంగా అధికారిక ప్రతినిథి మాట్లాడుతూ.. ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సుఖంగా తుది శ్వాస విడిచారని వెల్లడించారు. ఈస్ట్‌ సుసక్స్‌ లోని తన స్వగృహంలోనే ఆమె మరణించినట్టుగా తెలిపారు. బ్లాక్ మన్‌ కు మార్షియల్‌ ఆర్ట్స్‌లోనే ప్రవేశం ఉంది.

ఆ టాలెంట్ కారణంగానే ఆమెకు పలు హాలీవుడ్‌ యాక్షన్ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగే బాండ్ సీరిస్‌లో తెరకెక్కిన మూడో  చిత్రం గోల్డ్‌ ఫింగర్‌లో ఆమెకు అవకాశం వచ్చింది. ఆమె బాండ్ పాత్రధారి కానరీ కన్నా ఐదేళ్ల పెద్దది అయినా ఆయన సరసన హాట్ సీన్స్‌ లో నటించి ఆకట్టుకుంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Honor Blackman, best known for playing Bond Apr 6, 2020 at 10:33am PDT

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: