నడుమొంపులు చూపిస్తున్న షారూఖ్‌ కూతురు.. లాక్‌ డౌన్‌లో కొత్త పాఠాలు

JSR
కరోనా ప్రభావంతో ప్రపంచమంతా నాలుగు గోడల మధ్య ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సెల్రబిటీలు కూడా బయటకి వెళ్లే పరిస్థితి లేకపోవటంతో ఇంట్లోనే ఉండిపోతున్నారు. అయితే ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా ఆన్‌ లైన్‌ క్లాసులు తీసుకుంటున్నారు స్టార్ వారసులు. బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌ గారాల పట్టి సుహానా ఖాన్‌ కూడా ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. న్యూయార్క్‌లో ఓ ప్రముఖ కాలేజ్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్న ఆమె కరోనా అవుట్ బ్రేక్‌ కారణంగా ముంబై తిరిగి వచ్చేసింది.

అయితే ఈ సమయాన్ని వృథా చేయటం ఇష్టం లేక ఆన్‌లైన్‌లో బెల్లీ డాన్స్‌ క్లాసులు తీసుకుంటుంది. ఈ విషయాన్ని ప్రముఖ బెల్లీ డాన్సర్‌ సంజన ముత్రేజా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటుండగా తీసిన స్క్రీన్‌ షాట్‌ను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన సంజల సుహానాతో  బెల్లీ డాన్స్ చాలెంజ్‌ అంటూ కామెంట్ చేసింది. 

ఇటీవల సుహానా మేకప్‌ ఆర్టిస్ట్ గా ప్రయోగాలు చేస్తున్న వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది ఆమె తల్లి గౌరీ ఖాన్. కరోనా ప్రభావంతో కష్టాలు పడుతున్న ప్రజల కోసం తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వచ్చారు షారూఖ్‌ దంపతులు. నాలుగంతస్థుల తమ ఆఫీస్‌ బిల్డింగ్‌ను కరోనా అనుమానితుల క్వారెంటైన్‌ కోసం ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు అప్పగించారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Challenging ourselves with rolls !! Belly {{RelevantDataTitle}}