ఫస్ట్ టాటూ సీక్రెట్ బయట పెట్టిన తాప్సీ

JSR
కరోనా భయంతో ప్రస్తుతం ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు గతంలో దిగిన ఫోటోలను, గతంలో తమకు ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు తారలు. తాజాగా ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను కూడా గతంలో తాను తీసుకున్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది. తాను వేయించుకున్న తొలి టాటూ ఫోటోను షేర్ చేసి తాప్సీ ఆ అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.

పింక్‌ సినిమా కోసం ఈ టాటూను వేయించుకుంది తాప్సీ. `తొలి టాటూ పింక్‌ కోసం ట్రైల్ చేశాను. ఓ పక్షి తన రెక్కలు విప్పుకుంటూ ఎగిరేందుకు చేసే ప్రయత్నాన్ని టాటూ రూపంలో వేయించుకున్నా. ఓ పక్షి ఎవరి సహకారం లేకుండా తన శక్తితోనే ఎదుగుతుంది. నా ఒంటి మీద 2 టాటూలు ఉన్నాయి. ప్రస్తుతం నేను నా మెడ మీద మూడో టాటూ వేయించుకోవాలనుకుంటాన్నా` అంటూ కామెంట్ చేసింది.

ప్రస్తుతం ఇళ్లకే పరిమితమవుతున్న బాలీవుడ్ తారలు అభిమానులతో తరచూ ఇంటరాక్ట్ అవుతున్నారు. కొంత మంది తమ డైలీ రోటీన్‌ ను కూడా షేర్ చేసుకుంటుండగా మరికొందరు గత జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం తాప్సీ హాసీన్‌ దిల్‌రుబా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రష్మీ రాకెట్‌, శభాష్ మిట్టు సినిమాల్లోనూ నటించేందుకు రెడీ అవుతోంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
The first tattoo trial of Pink. The {{RelevantDataTitle}}