టాలీవుడ్ లో మరో కొత్త అందం... హిట్ కొట్టుద్దా?
అయితే, టాలీవుడ్ స్క్రీన్‌మీద అలాంటి పాత్రలు అరుదు కనుక పక్కింటి పిల్ల పాత్రలు రుహానీనీ మళ్లీ పలకరించలేదు. ఈమె అన్ని భాషల్లోనూ హిందీ, తమిళం, మలయాళంలో బిజీ కావడంతో ఆమె కూడా తెలుగు సినిమాలపైనా పెద్దగా ఫోకస్ చెయ్యలేదు. ఇప్పుడు విశ్వక్సేన్ హీరోగా చేసిన నాని సొంత సినిమా ‘హిట్’తో మళ్లీ తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది రుహానీ.
అయితే, హిట్ థియేటర్లకు రాకముందే మరో ప్రాజెక్టులో ఆమెకు చాన్స్ దక్కిందన్న మాట వినిపిస్తోంది. నాగశౌర్య హీరోగా నిర్మాత మహేష్ కోనేరు కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టనున్నాడు. కొత్త దర్శకుడు రాజా తెరకెక్కించనున్న ప్రాజెక్టు ఈవారంలోనే లాంచ్ చేసే అవకాశముందట. ఆ ప్రాజెక్టులో నాగశౌర్యకు జోడీగా రుహానీని ఎంపిక చేసినట్టు సమాచారం.
అందం, అభినయం కలగలిపిన తెలుగింటి మల్లె తీగ రుహానీకి -‘హిట్’ హిట్టయితే కనుక ఛాన్స్‌లు క్యూ కట్టడం ఖాయం. మరి ఆల్రెడీ విడుదలమైన ఈ సినిమా కాస్త హిట్ అనే అనిపించుకుంటుంది. పాత హీరోయిన్ల ఫేస్‌లు చూసి చూసీ మొహంమొత్తి కొత్త అందాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు ఆడియన్స్ ముచ్చటను రుహానీ తీరుస్తుందేమో చూడాలి. రుహాని శర్మకి మరి తెలుగు దర్శకులు అవకాశాలు ఇస్తారా లేదా ఏంటి అన్నది వేచి చూడాలి. అలాగే చాలా మంది ఈ మధ్య కాలంలో తెలుగుదనం ఉట్టిపడే అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటున్నారు. మరి ఈ అమ్మాయి గతంలో చేసిన సినిమాలతో పోల్చుకుంటే అలాంటి పాత్రలకి కరెక్ట్‌గా సెట్ అవుద్దనే చెప్పాలి.