కాజల్ కోసం రూమ్ బుక్ చేసి ఎంజాయ్ చేసిన తెలుగు స్టార్ హీరో...??

murali krishna
తెలుగు చలనచిత్ర సీమలో అందాల ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న కాజల అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి చలాకీగా నటించే కాజల్ కు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. చందమామ, మగధీర సినిమాలు ఆమె కెరీర్ ను మలుపు తిప్పాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన పాత తాలూకా జ్ఞాపకాలకు సంబంధించిన కొన్ని కొన్ని వార్తలు నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి.మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ అంద చందాలతో సినిమా ఇండస్ట్రీని ఏలేసిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు సీనియర్స్ పాత్రలో మెప్పిస్తున్నారు . అలాంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు . కానీ కొందరిని మాత్రమే జనాలు లైక్ చేస్తున్నారు .
ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ కాజల్. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటుంది . కాగా కాజల్ ఫ్రెండ్షిప్ కి ఎలాంటి వాల్యూ ఇస్తుందో మనకు అందరికీ తెలుసు . ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫ్రెండ్ షిప్ ని వదులుకోదు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు కూడా ఒక తెలుగు హీరోతో బాగా ఫ్రెండ్షిప్ చేసింది. పెళ్లి తర్వాత కొత్త సమస్యలు రాకూడదు అంటూ ఆ హీరో తో ఫ్రెండ్షిప్ ని కట్ చేసింది . అయితే ఒకానొక సందర్భంలో కాజల్ ఆ హీరో ని పెళ్లి చేసుకోబోతున్నది అంటూ ప్రచారం జరిగింది .కాజల్ కు వివాహం కాకముందు వరకు ఆమెపై పలురకాల వార్తలు చక్కర్లు కొట్టేవి. ముఖ్యమంత్రి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోతో ఎంతో సన్నిహితంగా ఉండేదని వార్తలు వచ్చాయి. అయితే కాజల్ మాత్రం అటువంటి వార్తలను పట్టించుకోలేదు. కేవలం స్నేహానికి మాత్రమే విలువిచ్చేది. ఆ హీరో కూడా తనకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో చనువిస్తుండేది. ఆ హీరోకు కూడా ఈ చందమామ అంటే చాలా ఇష్టమని ఫిలింనగర్ లో వార్తలు షికారు చేశాయి.
కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు తెలియకుండా సదరు హీరో ఒక రూమ్ బుక్ చేసి తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా చేశాడు. ఆరోజంతా కాజల్ ఎంతో సంతోషించింది. అయితే ఆ హీరో పేరు మాత్రం బయటకు రాలేదు. రకరకాల పేర్ల సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రస్తుతం వివాహమై ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది.రెండో ఇన్నింగ్స్ లోను మంచి సూపర్ హిట్ సినిమాలు చేస్తోంది.కాజల్ ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటున్న తెలుగు సీనియర్ హీరోలకు కాజల్ ఒక అవకాశమైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన కుటుంబానికి సంబంధించి, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. లక్ష్మీ కల్యాణం సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టి చందమామ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: