ఏపీ: భారీ మెజారిటీతో టీడీపీ కూటమి గెలుస్తుందని జీవీఎల్ నరసింహారావు సర్వే..?

Suma Kallamadi
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుని టీడీపీ ఒక శత్రువు లాగా చూస్తుంది. ఇక టీడీపీ అనుకూల మీడియా అయిన ఆంధ్రజ్యోతి కూడా ఆయనపై ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం జీవీఎల్ నరసింహారావు వైసీపీ నే కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా సమయం వచ్చినప్పుడు విమర్శిస్తుంటారు. ఇలా రెండు పార్టీలను తిడుతూ మధ్యలో ఉండటం కారణంగా ఆయన ఇరు పార్టీలకు కూడా ఒక శత్రువు అయిపోయారు. ఒకవేళ ఆయన పూర్తిగా టీడీపీ వైపే ఉన్నట్లయితే టీడీపీ పార్టీ అక్కున చేర్చుకుని ఉండేదేమో. కానీ అలా జరగలేదు కాబట్టి జీవీఎల్ నరసింహారావును క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసింది.
 అనూహ్యంగా జీవీఎల్ నరసింహారావు ఇటీవల ఒక సర్వే లాంటి రిపోర్టు ఇచ్చారు. టీడీపీ గెలుస్తుంది అన్నట్లుగా ఆయన సర్వే ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయనపై పొగడ్తలు కురిపించడం స్టార్ట్ చేసింది. బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఎన్డీఏ 110 స్థానాల్లో గెలుస్తుంది. 18 నుంచి 20 దాకా లోక్‌సభ స్థానాల్లో కూడా గెలుపొందుతుంది. ఈ బీజేపీ మాజీ మంత్రి ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ అంతర్గత సర్వే ఫలితాలను వెల్లడించారు.
తెలంగాణలో బీజేపీ 10 లోక్‌సభ స్థానాల దాకా గెలుచుకుంటుందని కూడా అన్నారు. బీజేపీ సానుకూల ఓటు పెరుగుతుందని ఆయన ఈ సందర్భంగా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత అరెస్టుల వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం జరగదని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఆప్‌ పార్టీ అవినీతి అరెస్టుతోనే వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ 5 అసెంబ్లీ స్థానాలను ఐదు లోక్‌సభ స్థానాలను విన్ అవుతుందని అంచనా వేశారు. ఏపీలో బీజేపీ ఓటు శాతాన్ని పెంచేందుకు కార్నర్ మీటింగ్స్ కూడా పెడతానని అన్నారు. ఆరో తేదీ నుంచి ఆ పని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: