గుంటూరు పశ్చిమం: కాంగ్రెస్‌, టీడీపీని చూసేశారు.. ఈ సారి వైసీపీ ర‌జ‌నీకి ఛాన్స్ ఉందా ?

Suma Kallamadi
రాజ‌ధాని అమ‌రావ‌తికి కూత‌వేటు దూరంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు ప‌శ్చిమం. జిల్లా కేంద్రంలో రెంటో ప‌ట్ట‌ణంలో విస్త‌రించి ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన 2014, 2019 రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ అభ్య‌ర్థులే గెలిచారు. విచిత్రం ఏంటంటే ఇక్క‌డ 2014లో టీడీపీ నుంచి గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో గెలిచిన మ‌ద్దాలి గిరి ఇద్ద‌రూ ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. టీడీపీలో గెలిచినా నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసుకోలేక‌పోయామ‌న్న ఆవేద‌న‌తో పాటు.. పార్టీలో ప్రాధాన్య‌త లేక వీరిరువురు ఫ్యాన్ కింద‌కే చేరిపోయారు.

క‌ట్ చేస్తే ఇప్పుడు ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా విడ‌ద‌ల ర‌జ‌నీ పేరు ముందుగా ఖ‌రారైంది. ఆ త‌ర్వాత టీడీపీ బీసీ మ‌హిళ‌గా గ‌ల్లా మాధ‌వి పేరు ఖ‌రారు చేసింది. టీడీపీ అభ్య‌ర్థి పేరు ఖ‌రారు అయ్యే టైంకే ఇక్క‌డ ర‌జ‌నీ దూసుకుపోయారు. ఎన్నిక‌ల కోడ్ రావ‌డానికి ముందే నియోజ‌క‌వ‌ర్గంలో చాలా పెండింగ్ స‌మ‌స్య‌లు చ‌క‌చ‌కా ప‌రిష్క‌రించేసి నియోజ‌క‌వ‌ర్గ జ‌నాల్లో అవురా అనిపించుకున్నారు. ఇక మాధ‌వి ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లోకి వెళుతోన్న ప‌రిస్థితి. ఆమె రాజ‌కీయాల‌కు పూర్తిగా కొత్త‌.

ఇక ప‌దేళ్లు ఇక్క‌డ టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాథినిత్యం వ‌హించినా నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీస మౌలిక సౌక‌ర్యాలు కూడా క‌ల్పించ‌లేదు. డ్రైనేజ్‌, తాగునీరు, అంత‌ర్గ‌త ర‌హ‌దారులు.. డివిజ‌న్ల‌లో పేరుకు పోయిన చెత్త‌, ఎక్క‌డిక‌క్క‌డ అడ్డ‌దిడ్డంగా ఉన్న క‌రెంటు తీగ‌ల‌ను స‌రిచేయ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌లు. ర‌జ‌నీకి ఇక్క‌డ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చాక రెండు నెల‌ల్లో చాలా వ‌ర‌కు ప‌రిష్క‌రించేశారు. ఈ విష‌యంలో మాత్రం ఆమెకు మంచి మార్కులే ప‌డుతున్నాయి.

ఎన్నిక‌ల కోడ్ రాకుండా ఉండి ఉంటే ర‌జ‌నీ మ‌రి కొన్ని స‌మ‌స్య‌లు అదే ఊపులో ప‌రిష్క‌రించి ఉండేవారేమో. విచిత్రం ఏంటంటే ఇక్క‌డ వ‌రుస‌గా రెండుసార్లు టీడీపీ గెల‌వ‌డానికి ముందు కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ‌ల్ల కూడా నియోజ‌క‌వ‌ర్గానికి ఒరిగిందేమి లేదు. కాంగ్రెస్ ఆ త‌ర్వాత టీడీపీ ప్ర‌భుత్వాల్లో గుంటూరు న‌గ‌ర అభివృద్ధి 20 ఏళ్లు వెన‌క్కి వెళ్లింది. రెండుసార్లు వ‌రుస‌గా గెలిచిన సీటును కాపాడుకోవ‌డం ఇప్పుడు చంద్ర‌బాబుకు క‌ష్టంగా మారింది.

టీడీపీ క్యాండెట్ గల్లా మాధ‌వి త‌న‌కంటే పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా పోటీ చేస్తోన్న పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ మీద ఎక్కువ ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి. ఒక‌సారి కాంగ్రెస్‌, రెండుసార్లు వ‌రుస‌గా టీడీపీ గెలిపించాం.. ఈ సారికి మాత్రం వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న మంత్రి ర‌జ‌నీని గెలిపిద్దామ‌న్న ఆలోచ‌న‌లో ఎక్కువ మంది ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆర్థిక‌, అంగ‌, సామాజిక బ‌లాలు కూడా ర‌జ‌నీ ఆధిప‌త్యాన్ని చాటుతున్నాయి. మ‌రి ఫైన‌ల్‌గా గుంటూరు ఓట‌రు ఈ సారి కొత్త పార్టీని గెలిపిస్తారేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: