వెండితెర మీద పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే అందాల భామ మలైకా అరోరా. 40 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే అందాలతో యువతకు నిద్రపట్టకుండా చేసే ఈ భామ, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అయితే తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన త్రో బ్యాక్ ఫోటోస్ పై నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. మలైకాకు మద్దతు తెలిపే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో.. ఆమె పోస్ట్ లను ట్రోల్ చేసే నెటిజెన్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు.
తాజాగా కొన్ని బ్లాక్ వైట్ ఫోటోలను పోస్ట్ చేసింది మలైకా, అయితే వాటిలో ఒక ఫోటో చీరతో పరిగెడుతున్నట్టుగా ఉండగా, మరో ఫోటోలో అందాలను ప్రదర్శిస్తూ బికినీలో దర్శనమిచ్చింది. అయితే ఈ ఫోటోల్లోని మలైకా గ్లామర్ చాలా మందికి నచ్చిన కొంత మందికి మాత్రం ట్రోలింగ్ కు అవకాశం ఇచ్చింది. ఈ పోస్ట్ పై ఓ అభిమాని కామెంట్ చేస్తు `ఆంటీ, మీరు ఇక రిటైర్మెంట్ తీసుకోండి` అన్నాడు. మరో వ్యక్తి ` మీరు ఏం పోస్ట్ చేసినా అందులో మీ వృద్దాప్యం కనిపిస్తోంది` అంటూ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి `మీరు ఫోటోలో చాలా బక్కగా ఉన్నారు కొంచెం ఏమైనా తినండి` అంటూ కామెంట్ చేశాడు.
మరో వ్యక్తి `అర్జున్ వాళ్ల ఆంటీ ఎలా ఉన్నారు` అని కామెంట్ చేశాడు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్జాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న తరువాత మలైకా అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మలైకా కన్నా అర్జున్ వయసులో చాలా చిన్నవాడు కావటంతో వీరిద్దరి రిలేషన్‌పై దారుణమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ జంట మాత్రం ఆ కామెంట్స్‌ను పట్టించుకోకుండా చెట్టాపట్టాలేసుకొని దేశ విదేశాలు తిరిగేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: