షర్మిల-జగన్:అక్కడే చెడిందా..గుట్టు విప్పిన వైయస్సార్సీపీ నాయకుడు..!

Divya
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.. గత కొన్ని నెలలుగా తన అన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉంది... అయితే ఈ విషయం పైన తాజాగా వైసిపి నేత కొండ రాఘవరెడ్డి తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. షర్మిల జగన్ పైన చేస్తున్న ఈ వాక్యాలకు ఘాటుగానే సమాధానం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత కొండ రాఘవరెడ్డి పలు విషయాలను వెల్లడించారు. వాటి గురించి చూద్దాం

కొండ రాఘవరెడ్డి మాట్లాడుతూ 1000కోట్ల ఆదాయం వచ్చే పని జగన్ చేయకపోవడం వల్లే షర్మిల తన భర్త అనిల్ కుమార్ ఇలా మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేత ఫైర్ అయ్యారు. తెలంగాణలో తట్ట బుట్ట సర్దుకొని అక్కడి ప్రజలను వైయస్సార్ పేరుతో మోసం చేసి మళ్లీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి అడుగుపెట్టింది షర్మిల అంటూ ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు.. షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ వెల్లడించారు కొండా రాఘవరెడ్డి.. ముఖ్యంగా జగన్ పెళ్లి లక్ష మందితో పులివెందులలో చేశారు.. ఆ పెళ్లికి చంద్రబాబుకు ఆహ్వానం లేదని.. ఆ పెళ్ళికి కూడా బాబు రాలేదని కూడా వెల్లడించారు.. జగన్ పై నిత్యం ఏదో ఒక విమర్శలు చేస్తూ ఉంటే చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి షర్మిల రెండు గంటల పాటు మాట్లాడి పెళ్లి పత్రికను ఇచ్చి వచ్చాను అంటూ తెలుపుతోంది.
అలా ఆ ఇంటికి వెళ్లినప్పటి నుంచే జగన్ తిట్టడం మొదలు పెట్టింది అంటూ తెలిపారు. చంద్రబాబుతో బేరం కుదరడం వల్లే షర్మిల అలా చేస్తోంది అంటూ ఘాటుగానే విమర్శించారు వైసిపి నేత.. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి సైతం అధ్యక్ష పదవి తెప్పించుకొని మరి వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుందని.. చంద్రబాబు వేసిన పాచికలలో షర్మిల కూడా ఒక పాచిక అంటూ వెల్లడించారు. ఈ విషయం పైన స్పందించాలంటూ కొండ రాఘవరెడ్డి షర్మిలకు సవాల్ విసిరారు.. ముఖ్యంగా నీ చెల్లి సునీత వివేక హత్య కేసులో చార్జి సీట్లను తీసుకొని రావాలని.. వివేక హత్య కేసులో మాట్లాడమని.. నీకు పాదయాత్ర చేయమని భారతి, విజయమ్మ ఏ ఒక్కరు కూడా చెప్పలేదని కూడా రాఘవరెడ్డి వీరుచుకుపడ్డారు. వివేక చనిపోయి ఇప్పటికీ ఐదేళ్లు కావస్తున్న ఎప్పుడు గుర్తు రాలేదు.. కానీ ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటూ ఫైర్ అయ్యారు.. కేవలం మీరు అడిగిన 1000 కోట్ల సంపద ఇవ్వలేకపోవడం వల్లే.. షర్మిల తన భర్త ఇలాంటి ఘోరాలకు పారపడుతున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: