ప్రభాస్‌ కొత్త ప్రేమాయణంకి ముహూర్తంఫిక్స్..!!

murali krishna
సలార్' మూవీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీకి ముందు వరకు ఎలాంటి హిట్‌లు లేక సతమతమైన ప్రభాస్‌కు, అతడి ఫ్యాన్స్‌కు సలార్ మూవీ ఆకలి తీర్చింది.బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దుమ్ము దులిపేసింది.గడిచిన కొన్నేళ్లల్లో ప్రభాస్‌ సరైన ప్రేమకథలో నటించలేదు. అన్ని యాక్షన్‌ తరహా చిత్రాలే. ఇప్పుడు ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు పెట్టనున్నారు.ప్రస్తుతం ‘కల్కి 2898 ఎడి', ‘సలార్‌ 2' ‘రాజాసాబ్‌' చిత్రాలతోపాటు ‘కన్నప్ప’లో అతిథి పాత్రలో కనిపించనున్నారు.వీటితోపాటు ఓ లవ్‌స్టోరీ చేయడానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ పక్కాగా సిద్థమైనట్టు సమాచారం. ప్రేమ ప్రధానంగా సాగే పీరియాడిక్‌ యాక్షన్‌ కథతో ఈ చిత్రం ఉండబోతున్నట్టు తెలిసింది .
‘సీతారామం' తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కథానాయిక ఎంపిక పక్రియ జరుగుతోంది. మరో పక్క మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరుగుతున్నాయని సమాచారం.ఈ మూవీ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. యాక్షన్ సినీ ప్రియుల్ని సైతం ఈ మూవీ ఎమోషన్‌తో ఏడిపించేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి – ప్రభాస్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి ఓ మూవీ ప్లాన్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు సినీ వర్గాల నుంచి సమచారం వస్తుంది.టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా లవ్ కాన్సెప్ట్‌తో సాగే పీరియాడిక్ యాక్షన్ స్టోరీతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ప్రేమ కథకి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. జులై నుంచి ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే ప్రభాస్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో 'కల్కి 2898' మూవీ ఒకటి. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతంగా పెంచేశాయి. ఇందులో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్‌ హీరోలా కనిపించి ఫ్యాన్స్‌కు ట్రీట్ అందించాడు. దీంతో అతడ్ని థియేటర్లలో చూసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతోపాటు మారుతీ దర్శకత్వంలో 'రాజాసాబ్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ చేయనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా జరుగుతున్నట్లు దర్శకుడు ఇటీవలే తెలిపాడు. అలాగే 'సలార్ 2' కూడా త్వరలో పట్టాలెక్కబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: