ప్రస్తుతం తెలుగులో వరస సక్సెస్ ల తో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. అందులో భాగంగా ఈఏడాది సంక్రాంతికి అల.. వైకుంఠపురముతో వచ్చి ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పూజా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు వున్నాయి. అందులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ ఒకటి. యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ఈ చిత్రంలో పూజా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇటీవల ఈ చిత్రం నుండి అఖిల్ ఫస్ట్ లుక్ విడుదలకాగ తాజాగా ఈ రోజు పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇక ఈ చిత్రంలో స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్ గా కనిపించనుందట పూజా. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. అతను నటించిన మూడు సినిమాలు నిరాశపరచగా ఈచిత్రమైనా హిట్ ఇస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరి ఐరన్ లెగ్ ముద్ర ను తొలిగించుకొని వరస గా హిట్లు కొడుతున్న పూజా ,అఖిల్ కు కూడా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే పూజా హెగ్డే ప్రస్తుతం ఈసినిమా తో పాటు తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. ఇక హిందీలో కూడా పూజా ఇటీవలే ఓ భారీ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తదుపరి సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.