బుల్లితెర: బిగ్ షాక్‌లో నాగబాబు.. తేడా కొట్టిన రిజల్ట్స్..
మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలె ఈటీవీలో ప్రసారమయ్యే సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి జబర్ధస్త్ షోకు మాములుగా ప్రసారమయ్యే సమయంలో ఎంత మంది చూస్తారో.. యూట్యూబ్‌లో అంతకు రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు. గత ఏడేళ్లుగా ఈ షో అప్రతిహతంగా దూసుకుపోతుంది. అలాగే నాగబాబుకు మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ.. ఈయన మాత్రం ఇటీవల జబర్దస్త్ కామెడీ షో నుండి బయటకు వచ్చేసిన నాగబాబు జీ తెలుగులో ప్రసారమయ్యే ‘అదిరింది’ కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
తనతో పాటూ సంస్థలోని కొంత మందినీ తీసుకుని వచ్చేశారు. అక్కడ నుంచి కొత్త ప్రయాణం మొదలు పెట్టారు. ఆ హడావుడిలో పాత సంస్థ పైన లెక్కలేనన్ని ఆరోపణలూ చేశారు. అలాగే అదిరింది షోతో జబర్ధస్త్ కామెడీ పని అయిపోయిందన్న కామెంట్స్ కూడా వినబడ్డాయి. కాని, ఇప్పుడు కొత్తగా వెళ్ళిన చోట పరిస్థితి ఆశావహంగా లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రోగ్రామ్‌ను చూసిన ప్రేక్షకులు ఈ షో చూసి జబర్ధస్త్‌కు జిరాక్స్ కాపీ తేల్చేశారు. ఇక తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగులు అదిరింది ప్రోగ్రామ్‌కు గట్టి షాకే ఇచ్చాయి.
ఇటీవల వచ్చిన రేటింగ్స్ చూస్తే.. జబర్ధస్త్‌కు 5 నుండి 6 రేటింగ్స్ వచ్చాయి. ఇక అదిరింది షోకి మాత్రం కేవలం 0.5 రేటింగ్ వచ్చింది. స్టార్ కమెడియన్లు చంద్ర, ఆర్పీ, ధన్‌రాజ్, వేణును రంగంలోకి దించినప్పటికీ అదిరింది షోకు ఆశించినంత స్థాయిలో రేటింగ్ మాత్రం రావట్లేదట. జబర్దస్త్‌ను ఢీకొట్టాలని వచ్చినప్పటికీ కనీసం దానికి పోటీ కూడా ఇవ్వలేకపోతుందని రేటింగ్స్ చూస్తేనే అర్థం అవుతుంది. మరోవైపు జబర్దస్త్ మాత్రం అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. ఏదేమైనా అదిరింది షో పై అప్పుడే ఇబ్బందికర వ్యాఖ్యలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో అదిరింది షోలో మార్పులు చేసే పనిలో పడింది యాజమాన్యం.