రాజు గారు ఇంతగా దిగజారిపోవాలా..!

shami

ఈ టైటిల్ చూసి కచ్చితంగా నిర్మాత దిల్ రాజు అని అనుకోవచ్చు. అసలు ఈ దిల్ రాజు నిర్మాత మారడానికి ఒక కారణమైన వ్యక్తి ఎమ్మెస్ రాజు. మహేష్ ఒక్కడు, ప్రభాస్ వర్షం ఇలాంటి సినిమాలు చేసి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ అంటే క్రేజీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అనేలా పేరు తెచ్చుకున్నాడు. అయితే అదంతా ఒకప్పుడు ఇప్పుడు ఆయన సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. నిర్మాతగా భారీ లాసైన ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ ను హీరోగా చేశాడు. అతగాడి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన ఎమ్మెస్ రాజు బోల్డ్ మూవీతో వస్తున్నాడు.

 

నిర్మాత నుండి డైరక్టర్ గా మారిన ఎమ్మెస్ రాజు తన డైరక్షన్ లో వాన, తునీగ తునీగ సినిమాలు చేశాడు. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈసారి ఎమ్మెస్ రాజు బోల్డ్ కంటెంట్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అలాంటి సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి బోల్డ్కంటెంట్ తో డర్టీ హరి అనే సినిమాతో వస్తున్నారు ఎమ్మెస్ రాజు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న ఎమ్మెస్ రాజు ఈరోజు సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

 

సినిమా టైటిల్ కు తగినట్టుగానే బాత్ టబ్ లో కుర్రాడు సిగరెట్ తాగుతూ కనిపించాడు.. అయితే ఆ సిగరెట్ ను తన చేతితో కాకుండా బాత్ టబ్ లో అవతల కూర్చున్న అమ్మాయి కాలితో పట్టుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే యూత్ ఆడియెన్స్ నే టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమా ఈఎ డర్టీ హరి. టైటిల్ లోనే డర్టీ అని పెట్టారంటే ఇక ఈ డర్టీ హరి చేసే డర్టీ పనులు ఎలా ఉంటాయో చూడాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన కొందరు ఎమ్మెస్ రాజు అభిమానులు హర్ట్ అయ్యారని చెప్పొచ్చు. హిట్టు కొట్టడం కోసమే అయితే ఎమ్మెస్ రాజు ఇంతగా దిగజారిపోవాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: